|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మురళీ మోహన్ పద్మశ్రీ: ఆలస్యమైనా అద్భుతం! ఆయన మనోగతం వింటే కన్నీళ్లాగు.

Published: 26-01-2026, 5:05 AM
మురళీ మోహన్ పద్మశ్రీ: ఆలస్యమైనా అద్భుతం! ఆయన మనోగతం వింటే కన్నీళ్లాగు.
  • మురళీ మోహన్‌కు పద్మశ్రీ రావడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.
  • తనకు పద్మశ్రీ రావడం ఆలస్యమైనా సంతోషంగా ఉందని మురళీ మోహన్ అన్నారు.
  • ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.
  • ఐదు దశాబ్దాలుగా సినీ రంగానికి మురళీ మోహన్ చేసిన సేవలకు ఇది గుర్తింపు.

సీనియర్ నటుడు మురళీ మోహన్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనకు ఈ గౌరవం ఆలస్యంగా వచ్చినందుకు ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

పద్మశ్రీ వచ్చినందుకు మురళీ మోహన్ సంతోషం

Murali Mohan: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ రకాల పురస్కారాలను ప్రకటిస్తూ వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించడమే కాకుండా వారిని అవార్డుల పేరుతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో పద్మ అవార్డులు కూడా ఎంతో కీలకమైనవి. ప్రతి ఏడాది పద్మ అవార్డులను ప్రకటిస్తూ వస్తారు. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఈ ఏడాది ఏకంగా 131 మందికి ఈ పద్మ అవార్డులను ప్రకటించింది.

ఇందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తనకు పద్మశ్రీ అవార్డు(Padma Shri Award) దక్కడం పట్ల సీనియర్ నటుడు మురళీమోహన్ (Murali Mohan)సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన పద్మ అవార్డుల పట్ల స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మీడియా వారు ఎంతోమంది ఫోన్లో చేసే అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరితో నా సంతోషాన్ని పంచుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

మురళీ మోహన్ కృతజ్ఞతలు

ఇక చాల మంది ఈ విషయం గురించి ఫోన్లు చేస్తూ మీకు ఈ పురస్కారం ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడు వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. ఈ అవార్డు తనకు లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిందని అన్ని మనం అనుకున్నప్పుడే రావు, ప్రతిదానికి సమయం ఉంటుందని, మనం ఎదురు చూసినప్పుడు వచ్చే వాటికే విలువ ఎక్కువ అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి గొప్ప పురస్కారాన్ని తనకు అందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే అభిమానులు చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం..

సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాల సేవలు

గత ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో ఎనలేని సేవలు చేసిన మురళీమోహన్ కృషిని గుర్తించి ఆయనకు భారత ప్రభుత్వం అత్యుత్తమమైన పురస్కారాన్ని ప్రకటించడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరొక నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇక మురళీమోహన్ ఇండస్ట్రీలో హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికి పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

మురళీ మోహన్‌కు పద్మశ్రీ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఆయన సేవలకు ఇది తగిన గుర్తింపు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.