|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి: మురళీ మోహన్‌

Published: 26-06-2025, 5:46 AM
ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి: మురళీ మోహన్‌

‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం ప్రచార కార్యక్రమంలో మురళీమోహన్ పాల్గొని, ఇలాంటి సినిమాలు విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు ఆమని కూడా నటిస్తున్నారు. టీవీ రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Key Points

1

మురళీమోహన్ నటించిన 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' చిత్రం జూన్ 24న పోస్టర్, గ్లింప్స్ విడుదల.

2

డొక్కా సీతమ్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, కమర్షియల్ సినిమాల మధ్య విభిన్నంగా ఉంది.

4

నిర్మాతలు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నారు.

‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం విడుదల

‘‘డొక్కా సీతమ్మగారిలాంటి గొప్పవారిపై సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్‌ అయిపోయిన సమయంలో రాంబాబు, రవి నారాయణగారు  ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం నిర్మిస్తుండటం అభినందనీయం. ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని మురళీమోహన్‌ తెలిపారు. టీవీ రవి నారాయణ్‌ దర్శకత్వంలో మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు.

జూన్‌ 24న మురళీమోహన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను, గ్లింప్స్‌ని విడుదల చేశారు. టీవీ రవి నారాయణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్‌గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడివరకూ వచ్చింది’’ అన్నారు. అతిథిగా హాజరైన డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘డొక్కా సీతమ్మగారి’ కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తీక్, నిర్మాతలు సాయివెంకట్, రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగో΄ాల్, డైరెక్టర్‌ శివ నాగు, దాసన్న తదితరులు మాట్లాడారు.

మురళీమోహన్ ప్రశంసలు

చిత్ర నిర్మాణ వివరాలు

మొత్తంమీద, డొక్కా సీతమ్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మురళీమోహన్ వంటి ప్రముఖ నటుల ప్రోత్సాహం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.