|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ వాచ్ కోసం నాగ వంశీ పట్టుదల: ఆ వాచ్ వెనుక ఉన్న కథ ఇదే!

Published: 04-01-2026, 6:00 AM
ఎన్టీఆర్ వాచ్ కోసం నాగ వంశీ పట్టుదల: ఆ వాచ్ వెనుక ఉన్న కథ ఇదే!
  • నిర్మాత నాగ వంశీ హీరోలు, దర్శకుల నుంచి బహుమతులు అందుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
  • జూనియర్ ఎన్టీఆర్ (రెండుసార్లు), అల్లు అర్జున్ (ఒకసారి) నుంచి వాచ్‌లను బహుమతిగా అందుకున్న వంశీ.
  • అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ వాడిన వాచ్‌నే కావాలని అడిగి మరి తీసుకున్న వంశీ.
  • తారక్ వాచ్ ఖరీదు కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ తనకెంతో విలువైనదన్న నాగ వంశీ.

ప్రముఖ నిర్మాత నాగ వంశీ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తారక్ అన్న తనకు బహుమతులు ఇచ్చారని, అందులో అరవింద సమేత సమయంలో ఆయన వాడిన వాచ్‌ను అడిగి మరీ తీసుకున్నానని వంశీ తెలిపారు. దీని వెనుక ఉన్న ప్రేమ కథ అభిమానులను ఆకట్టుకుంటోంది.

గిఫ్టులపై నాగ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

Naga Vamshi About Jr NTR: ప్రముఖ నిర్మాత నాగ వంశీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా అభిమానుల్లో విస్తృతంగా.. చర్చకు దారి తీస్తున్నాయి. నిర్మాతలు హీరోలతో లేదా దర్శకులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు బహుమతులు ఇస్తారా? అనే ప్రశ్నకు.. ఆయన ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆకట్టుకుంది.

ఇంటర్వ్యూలో యాంకర్, “సాధారణంగా నిర్మాతలు హీరోలకు లేదా దర్శకులకు గిఫ్టులు ఇస్తుంటారు కదా?” అని అడగగా..దీనికి నాగ వంశీ .. అలా ఏమీ లేదు అవన్నీ అబద్ధాలే అని చెప్పుకొచ్చాడు. అయితే యాంకర్ మళ్లీ ప్రశ్నిస్తూ, “మీరేమైనా హీరోల నుంచి గిఫ్టులు తీసుకున్నారా?” అని అడగగా, నాగ వంశీ.. “అవును… నాకు ఇద్దరు హీరోల నుంచే గిఫ్టులు వచ్చాయి” అని చెప్పారు. ఆ ఇద్దరు ఎవరో కూడా ఆయన వెల్లడించారు. “తారక్ అన్న నాకు రెండుసార్లు గిఫ్టులు ఇచ్చారు. బన్నీ ఒకసారి గిఫ్ట్ ఇచ్చాడు” అని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నాగ వంశీ ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. దేవర.. అరవింద సమేత వీర రాఘవ సినిమాల సమయంలో తారక్ అన్న తనకు గిఫ్టులు ఇచ్చారని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..అల వైకుంఠపురములో సినిమా సమయంలో బన్నీ తనకు ఒక గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. అయితే ఇద్దరూ కూడా వాచ్ లే గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు.

ఎన్టీఆర్ వాచ్‌పై ప్రత్యేక అభిమానం

ఈ ఇంటర్వ్యూలో అందరికీ బాగా నచ్చిన విషయం ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాచ్ గురించి నాగ వంశీ చెప్పిన మాటలు. “అరవింద సమేత సినిమా సమయంలో తారక్ అన్న నాకు కొత్త వాచ్ కొనిస్తానన్నారు. కానీ నేను కొత్తది వద్దని చెప్పి, ఆయన చేతిలో ఉన్న వాచ్‌నే అడిగాను. వద్దురా నీకు కొత్తది కొలుస్తాను అన్నారు అయినా కానీ నేను ఒప్పుకోలేదు” అని నాగ వంశీ చెప్పారు.

దానికి యాంకర్, “ఆ వాచ్ ఖరీదైనదా?” అని అడిగితే, నాగ వంశీ.. “ధర విషయం కాదు. అది ప్రేమతో తీసుకున్నది. అది తారక్ అన్న వాచ్ కాబట్టే నాకు విలువైనది” అన్నారు. అంతేకాదు, “నేను అడగగానే తారక్ అన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాచ్ ఇచ్చేశారు” అని చెప్పారు.

తారక్ పై అభిమానం ఆది సినిమా నుంచే

చివరిగా..జూనియర్ ఎన్టీఆర్‌పై తన అభిమానమెలా మొదలైందో కూడా నాగ వంశీ వెల్లడించారు. “తారక్ అన్నపై నా అభిమానం ఆది సినిమా నుంచే మొదలైంది” అని చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.

నాగ వంశీ జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని, వారి బంధాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారు. తారక్ వాడిన వాచ్ తీసుకోవడం ద్వారా వారి మధ్య స్నేహం, అభిమానం ఎంత బలమైనవో స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.