
📌 Key Points
- అభిషేక్ నామా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నాగబంధం’ జూలై 03న విడుదల కానుంది.
- ఈ చిత్రం మన దేశంలోని పురాతన ఆలయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను వెలికితీస్తుంది.
- హీరోగా విరాట్ కర్ణ, హీరోయిన్లుగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు.
- ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో సెట్లు నిర్మించారు.
అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన ‘నాగబంధం’ సినిమా జూలై 3న విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ పురాతన ఆలయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను అన్వేషిస్తుంది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘నాగబంధం’ విడుదల తేదీ ఖరారు
Nagabandham Movie: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మైథలాజికల్ అడ్వెంచర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ (Nagabandham) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 03, శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ఎప్పటి నుంచో మంచి హైప్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన్ సాంగ్ మంచి టాక్ తచ్చుకుంది. పాన్ ఇండియా బాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
Read also- Balakrishna Award: ఐఎఫ్ఎఫ్‌డీ 2026 ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డ్ అందుకున్న బాలయ్య బాబు..
ఆలయాల వెనుక రహస్యాలను వెలికితీసే కథ
‘నాగబంధం’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది మన దేశంలోని పురాతన ఆలయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మాలను వెలికితీసే కథ. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గదులు, పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం వంటి వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించారు. 1750వ కాలం నాటి చారిత్రక అంశాలను మేళవిస్తూ, భూమి అడుగున దాగిన ‘నాగబంధం’ అనే మర్మమైన నిధిని కాపాడే క్రమంలో సాగే ఉత్కంఠభరితమైన ప్రయాణమే ఈ సినిమా.
Read also- Peddi Movie: నెల ముందే ఓవర్సీస్ లో పెద్ది అడ్వాన్స్ బుకింగ్.. ఒక్కో టికెట్టు ధర ఎంత అంటే?
భారీ తారాగణంతో రూపొందిన చిత్రం
‘పెద్దకాపు’ చిత్రంతో మెప్పించిన యువ హీరో విరాట్ కర్ణ ఈ భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. వెర్సటైల్ నటులు జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ అఘోరా పాత్రలో మెప్పించబోతున్నారు. అభిషేక్ నామా స్వయంగా దర్శకత్వం వహిస్తూ, అభిషేక్ పిక్చర్స్, NIK స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అభే జునైద్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన సెట్లను నిర్మించారు. గ్రాఫిక్స్ (VFX) పరంగా హాలీవుడ్ ప్రమాణాలను అందుకోవాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సనాతన ధర్మం, పురాతన సంస్కృతి అడ్వెంచర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘నాగబంధం’ ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. జూలై 3న థియేటర్లలో ఈ రహస్య నిధి గుట్టు విప్పడానికి సిద్ధంగా ఉండండి.
మొత్తానికి, ‘నాగబంధం’ సినిమా పురాతన ఆలయాల వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీసే ఒక సాహసోపేతమైన కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూలై 3న విడుదలకు సిద్ధంగా ఉంది.


