
Key Points
నాగార్జున గారు జెన్ జెడ్ తరం వారికి ఫోన్ వాడకాన్ని తగ్గించమని సలహా ఇచ్చారు.
అధిక ఫోన్ వాడకం వల్ల డబ్బు సంపాదించేందుకు సమయం దొరకదని నాగ్ అభిప్రాయం.
నాగ్ తాజా చిత్రం కుబేర జూన్ 20న విడుదల కానుంది.
కుబేర చిత్రంలో ధనుష్ మరియు రష్మిక మందన్న కూడా నటిస్తున్నారు.
నాగార్జున గారి సలహా
దేశంలో అత్యంత ధనిక హీరోల్లో కింగ్ నాగార్జున ( Nagarjuna Akkineni ) ఒకరు. షారూఖ్ ఖాన్, జుహీ చావ్లా తర్వాత రూ.3500 కోట్ల సంపదతో ఈయన మూడో స్థానంలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆయన సంపదను మరింత పెంచాయి. తాజాగా నాగ్ జెన్ జెడ్ ( Generation Z )కు విలువైన సలహా ఇచ్చాడు.
డబ్బు ఎప్పుడు సంపాదిస్తారు? కుబేర సినిమా ఈవెంట్‌లో యాంకర్ సుమ ( Anchor Suma Kanakala ) మాట్లాడుతూ.. జెన్ జెడ్ ఫోన్ రీచార్జులపై ఎక్కువ ఖర్చు పెడుతోంది. అసలేం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఓ సలహా ఇవ్వమని నాగార్జునను అడిగింది. అందుకాయన క్షణం ఆలోచించకుండా ఫోన్ చూడటం ఆపేయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే డబ్బులు సంపాదించేందుకు సమయం ఎక్కడుంది? అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇదేంటి? ఈ సలహా నాకే చెప్తున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కుబేర చిత్ర విడుదల
సినిమా నాగార్జున చివరగా నా సామిరంగ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కుబేర, కూలీ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండు కూడా మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కుబేరకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా జిమ్ సర్భ్ ముఖ్య పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.


