
నాగచైతన్య మరియు సమంత విడాకుల తర్వాత, నాగచైతన్య తన మొదటి ముద్దు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అది సమంత కాదని, తొమ్మిదో తరగతిలోనే వేరే అమ్మాయికి ఇచ్చినట్లు తెలిపాడు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
Key Points
నాగచైతన్య తన మొదటి ముద్దు సమంతకు కాదని వెల్లడించాడు.
తొమ్మిదో తరగతిలోనే ఒక అమ్మాయికి తన మొదటి ముద్దు ఇచ్చినట్లు చెప్పాడు.
ఒక అభిమాని చేసిన వ్యాఖ్య కూడా ఆయనకు మర్చిపోలేని జ్ఞాపకం.
నాగచైతన్య మొదటి ముద్దు రహస్యం
నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి కారణాలు ఏంటనేది వెల్లడించలేదు. రకరకాల రూమర్లు వినిపించాయి, కానీ ఏది నిజం అనేది తెలియదు.
నాగచైతన్య ఇటీవలే మరో హీరోయిన్ శోభితా దూళిపాళని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగింది. ఇప్పుడు వీరిద్దరు తమ వైవాహిక జీవితాన్నిఎంజాయ్ చేస్తున్నారు.
తొమ్మిదో తరగతి ప్రేమ జ్ఞాపకం
ఇదిలా ఉంటే నాగచైతన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన మొదటి ముద్దు గురించి ఓపెన్ అయ్యారు. సాధారణంగా తన మొదటి ముద్దు తన ఫస్ట్ లవర్ సమంతకే ఇచ్చి ఉంటారని అంతా భావిస్తారు. కానీ ఆయన సమంతకి ఇవ్వలేదట. అంతకు ముందే వేరే అమ్మాయికి ఇచ్చేశాడట. అంతేకాదు ఆ ముద్దు తన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని తెలిపారు చైతూ.
రానా నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న నాగచైతన్య తన ఫస్ట్ కిస్ గురించి ఓపెన్ అయ్యారు. మొదటి ముద్దు ఎవరికి పెట్టావో గుర్తుందా అని రానా అడగ్గా, చైతూ స్పందిస్తూ తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి పెట్టినట్టు తెలిపారు. అంతేకాదు ఆ కిస్ తన జీవితమంతా గుర్తుండిపోతుందన్నారు.
అభిమాని వ్యాఖ్య – మరపురాని జ్ఞాపకం
ఇదే సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు చైతూ. ఒక అభిమాని తన వద్దకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా(అందంగా) ఉన్నారని చెప్పడం కూడా మర్చిపోలేని జ్ఞాపకం అని వెల్లడించారు చైతూ. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. తన మొదటి ముద్దు గురించి తెలిపిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


