
📌 Key Points
- నాగార్జున త్వరలో తాత కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- ఈ వార్తలపై నాగార్జున నేరుగా ఖండించకుండా, సరైన సమయం వచ్చినప్పుడు స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.
- నాగార్జున స్పందనతో అక్కినేని కుటుంబం నుండి త్వరలో శుభవార్త రావడం ఖాయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- నాగచైతన్య, శోభితల వివాహం జరిగి ఏడాది పూర్తైన నేపథ్యంలో వారిద్దరూ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు.
అక్కినేని కుటుంబంలో త్వరలో పండగ వాతావరణం నెలకొననుందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున తాత కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, ఈ విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. నాగార్జున స్పందనతో అక్కినేని ఇంట గుడ్ న్యూస్ ఖాయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున తాత కాబోతున్నారనే వార్తలు
Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ నాగార్జున(Nagarjuna) స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు నాగార్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా అక్కినేని హీరోలందరూ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా అక్కినేని కుటుంబం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. నాగార్జున తన ఇద్దరి కొడుకులకు ఇటీవల పెళ్లి చేసిన సంగతి తెలిసిందే అయితే త్వరలోనే నాగార్జున తాతయ్య కాబోతున్నారు అంటూ ఓ వార్త బలంగా వినపడుతోంది. ఈ వార్తలను అక్కినేని కుటుంబ సభ్యులు ఎక్కడ ఖండించలేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జునకు ఇదే ప్రశ్న ఎదురైనది. మీరు తాతయ్య కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి నిజమేనా అంటు నాగార్జునకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నాగార్జున చెప్పిన సమాధానం విన్న అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
సోషల్ మీడియా పుకార్లు.. నాగార్జున స్పందన
ఈ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ.. ఈ విషయం గురించి సరైన సమయం వచ్చినప్పుడు స్వయంగా నేనే తెలియజేస్తాను అంటూ మాట్లాడటంతో అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్తలలో నిజం లేకపోతే నాగార్జున స్వయంగా అలాంటిదేమీ లేదు అంటూ ఈ వార్తలను ఖండిస్తారు. అలా కాకుండా నాగార్జున స్వయంగా నేనే సమయం వచ్చినప్పుడు చెబుతా అని మాట్లాడటంతో కచ్చితంగా త్వరలోనే అక్కినేని కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ రాబోతుందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నాగచైతన్య శోభిత వివాహం జరిగి ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్నాయి.. నాగచైతన్య శోభిత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ఏడాది మొదట్లో అఖిల్ జైనబ్ అనే అమ్మాయితో వివాహం జరుపుకున్నారు. అఖిల్ కూడా లెనిన్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్య, శోభిత గురించిన ఊహాగానాలు
మొత్తంగా, నాగార్జున తన వ్యాఖ్యలతో అక్కినేని కుటుంబంలో శుభవార్త రాబోతోందని పరోక్షంగా ధృవీకరించినట్లైంది. నాగచైతన్య, శోభితల గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. ఈ గుడ్ న్యూస్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


