
నాగార్జునను పెద్ద స్టార్‌గా నిలబెట్టిన ‘శివ’ చిత్రం 4K డాల్బీ అట్మాస్‌లో రీ-రిలీజ్ అవుతోంది. ట్రైలర్ లాంచ్‌లో నాగార్జున మాట్లాడుతూ, రామ్‌గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. 36 ఏళ్ల తర్వాత సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Key Points
'శివ' సినిమా నన్ను పెద్ద స్టార్‌ని చేసిందని నాగార్జున రామ్‌గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా 'శివ'ని 4K డాల్బీ అట్మాస్‌లో రీ-రిలీజ్ చేస్తున్నారు.
నాగార్జున, వర్మ 36 ఏళ్ల తర్వాత 'శివ' రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఒకే వేదికపై లాంచ్ చేశారు.
రామ్‌గోపాల్ వర్మ 6 నెలల పాటు 'శివ' సౌండ్‌ట్రాక్‌ను ఒరిజినల్ లాగా అద్భుతంగా డిజైన్ చేశారు.
నాగార్జున ‘శివ’ జ్ఞాపకాలు
‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్‌లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్‌ని చేసిన నా మిత్రుడు రామ్‌గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.
4K డాల్బీ అట్మాస్‌లో ‘శివ’ రీ-రిలీజ్
అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్‌లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్‌ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.
వర్మ కృషి, సినిమా ఎప్పటికీ చిరస్మరణీయం
మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.
‘శివ’ ఒక అనుభూతి అని నాగార్జున పేర్కొన్నారు. రాజమౌళి, చిరంజీవి వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ఈ సినిమా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వర్మ నొక్కి చెప్పారు. 4K డాల్బీ అట్మాస్ రీ-రిలీజ్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు.


