|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నాజర్! ఎంజీఆర్‌పై చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్!

Published: 12-03-2026, 10:05 AM
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నాజర్! ఎంజీఆర్‌పై చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్!
  • ఎంజీఆర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నాజర్.
  • రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నాజర్.
  • ఎంజీఆర్ గొప్ప నటుడు, నాయకుడు అని కొనియాడిన నాజర్.
  • విమర్శించిన వారిలో నటుడు విశాల్ కూడా ఉన్నారు.

నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల దివంగత ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు నాజర్ తీవ్రంగా స్పందించారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై దుమారం

Actor Nassar: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇటీవల కాలంలో తన మాట తీరు కారణంగా వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శలను ఎదుర్కొన్న రాజేంద్రప్రసాద్ తాజాగా తమిళ ఆరాధ్య దైవం ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు దివంగత ఎంజీఆర్(MGR) గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ఇటీవల కాంతారావు జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కాంతారావు(Kantharao) గొప్పతనం గురించి గొప్పగా వర్ణించారు.

కాంతారావు జానపద కథ చిత్రాలలో దూసుకుపోయే వారంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు అక్కడి వరకు బానే ఉంది కానీ కాంతారావుని చూసి ఎంజీఆర్ ఉ**కునేవాడు. కాంతారావుని చూస్తే భయపడి పోయేవారు అంటూ ఎం జి ఆర్ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ ప్రేక్షకులు రాజేంద్రప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ రాజేంద్రప్రసాద్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు.

విమర్శలు గుప్పించిన నటుడు నాజర్

ఇప్పటికే నటుడు విశాల్ ఈ వ్యవహారం పై స్పందిస్తూ రాజేంద్రప్రసాద్ పట్ల విమర్శలు కురిపించడమే కాకుండా తక్షణమే క్షమాపణలు చెప్పాలని తెలిపారు. ఇలా విశాల్ స్పందించిన వెంటనే మరో నటుడు నాసర్ కూడా రాజేంద్రప్రసాద్ వివాదం పై స్పందించారు. ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ రాజేంద్రప్రసాద్ తీరును తప్పుపట్టారు. నా స్నేహితుడు నా సహ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల ద గ్రేట్ యాక్టర్ కాంతారావు గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారని తెలిపారు.

వెంటనే క్షమాపణలు చెప్పండి..

క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

కాంతారావు గారి గురించి గొప్పగా మాట్లాడటంలో తప్పులేదు కానీ ద గ్రేట్ యాక్టర్ ఎంజీఆర్ గురించి అలా మాట్లాడటం సరైనది కాదని తెలిపారు. ఇటీవల నా తోటి నటీనటులు ఈ వీడియోని పంపిస్తే తాను చూసానని తెలిపారు. గత కొంతకాలంగా తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులు కలిసిమెలిసి పని చేస్తున్నారు. ఎంజీఆర్ గారు ఒక గొప్ప నటుడు మాత్రమే కాకుండా ఒక గొప్ప నాయకుడు కూడా ఈయన దశాబ్ద కాలంగా రాజకీయాలలో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి రావడానికి ముందుగానే ఎంజీఆర్ గారు రాజకీయాలలో సక్సెస్ సాధించారని నాసర్ తెలిపారు. ఇలా గొప్ప నటుడు నాయకుడు గురించి మీరు ఇలా మాట్లాడటం చాలా బాధాకరం వెంటనే మీ వ్యాఖ్యలను సరి చేసుకొని క్షమాపణలు చెప్పాలి అంటూ నాజర్ రాజేంద్రప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదం పై రాజేంద్రప్రసాద్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఎంజీఆర్ గారి పట్ల రాజేంద్రప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ క్షమాపణలు చెబుతారా లేదంటే ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తారని తెలియాల్సి ఉంది.

ఎంజీఆర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. నాజర్ డిమాండ్‌తో ఈ వివాదం మరింత ముదిరిందా లేదా అనేది వేచి చూడాలి. రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.