|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నడలో తొలి సినిమా.. పవర్ స్టార్ సమాధి ముందు నవీన్ చంద్ర భావోద్వేగం! వైరల్ వీడియో

Published: 25-12-2025, 8:53 AM
కన్నడలో తొలి సినిమా.. పవర్ స్టార్ సమాధి ముందు నవీన్ చంద్ర భావోద్వేగం! వైరల్ వీడియో
  • నవీన్ చంద్ర తన తొలి కన్నడ చిత్రం ‘మార్క్’ విడుదలకు ముందు పునీత్ సమాధిని దర్శించారు.
  • పునీత్ ఆశీస్సులు కోరుతూ మోకాళ్లపై పడి భావోద్వేగమైన వీడియో షేర్ చేశారు.
  • ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు.
  • కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మార్క్’ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించారు.

యంగ్ హీరో నవీన్ చంద్ర తన తొలి కన్నడ చిత్రం విడుదలకు ముందు దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు. ఆయన ఆశీస్సులు కోరుతూ మోకాళ్లపై పడి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అభిమానుల మనసులను గెలుచుకుంది.

నవీన్ చంద్ర వరుస విజయాలు

Naveen Chandra:యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఇటీవలే బ్లైండ్ స్పాట్ , ఎలెవన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇటీవల షో టైం అనే మరో చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల , నరేష్ విజయ్ కృష్ణ, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు ఓటీటీలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

అలా వరుస యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ జానర్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్ చంద్ర తాజాగా కన్నడ సూపర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. “నా తొలి కన్నడ మూవీ ఈరోజు విడుదల కాబోతోంది. మీ ఆశీస్సులు మాపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అంటూ పునీత్ రాజకుమార్ సమాధి ముందు మోకాళ్ళ పైన పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు ఒక వీడియోని షేర్ చేశారు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన తొలి కన్నడ మూవీ కోసం కన్నడ సూపర్ స్టార్ ఆశీర్వాదం తీసుకోవడం నిజంగా ప్రశంసనీయమంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పునీత్ రాజ్ కుమార్ ఆశీస్సులు కోరిన నవీన్

నవీన్ చంద్ర తాజాగా నటించిన తన తొలి కన్నడ మూవీ విషయానికే వస్తే.. ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ హీరోగా.. యాక్షన్ డ్రామాగా వచ్చిన చిత్రం మార్క్. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు విడుదలైంది.. ఈ మూవీ కన్నడ, తెలుగు , తమిళ్ ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిచ్చా సుదీప్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు.

నవీన్ చంద్ర తొలి కన్నడ చిత్రం ‘మార్క్’

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ తప్పిపోయిన పిల్లలను వెతికి , నేర ప్రపంచాన్ని ఎలా బయట పెట్టగలిగాడు అనే కథాంశం చుట్టూ ఈ సినిమా సాగుతుంది..ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర భాగం కావడంతో ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags Kiccha Sudeep Naveen Chandra Share

నవీన్ చంద్ర తన తొలి కన్నడ సినిమాకు పునీత్ ఆశీస్సులు కోరడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భావోద్వేగ ఘట్టం కన్నడ ప్రజలతో అతని అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని చెప్పొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.