|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార ‘టాక్సిక్’ మూవీ పారితోషికం లీక్! యష్ సరసన నయన్ అందుకుంటున్న మొత్తం తెలిస్తే షాక్!

Published: 12-01-2026, 1:15 AM
నయనతార 'టాక్సిక్' మూవీ పారితోషికం లీక్! యష్ సరసన నయన్ అందుకుంటున్న మొత్తం తెలిస్తే షాక్!
  • నయనతార ‘టాక్సిక్’ మూవీలో యష్ సరసన నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
  • తాజాగా విడుదలైన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు.
  • నయనతార పెళ్ళి తర్వాత కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
  • ఈమె ‘టాక్సిక్’ మూవీ కోసం దాదాపు 18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

లేడీ బాస్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. కన్నడ హీరో యష్ సరసన ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్న ఆమె, ఈ సినిమా కోసం భారీగా పారితోషికం అందుకుంటున్నారు. ఆమె రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నయనతార క్రేజ్ వెనుక అసలు రహస్యం ఏమిటి?

Toxic Movie: ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఎప్పుడూ తమ అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. ఎప్పటికప్పుడు బాడీని పెట్టుగా ఉంచుకునేందుకు జిమ్ లో తెగ చెమటలు కక్కిస్తూ ఉంటారు. ఈమధ్య హీరోయిన్లందరూ కూడా వయసు పెరిగినా కూడా చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.. అలాంటి ముద్దుగుమ్మల్లో లేడి బాస్ తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా ఈమె 20 లో ఉన్నట్లే కనిపిస్తుంది. హీరోయిన్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కూడా ఈమెనే.. నయనతార అదృష్టం మామూలుగా లేదు. కోలీవుడ్లో అడుగు పెట్టడంతోనే శరత్‌ కుమార్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించే అవకాశాన్ని పొందారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నయనతారనే ఉంది. ఇవాళ థియేటర్లోకి వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది. ఇప్పుడు కన్నడ హీరో రాక్స్టార్ యష్ సరసన టాక్సిక్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో నటించిన తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు నయన్ ఎన్ని కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం..

నయనతార తాజాగా రిలీజ్ అయిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.. మొదటి షో తోనే మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇకపోతే నయనతార ప్రస్తుతం కన్నడ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీలో ఈమె నటించిన భారీగా రెమ్యూనరేషన్ తీసుకుపోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీకి గాను ఈమె 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లయినా కూడా ఈమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలు ఆమె తలుపు తడుతున్నాయి.. దాంతో నయనతారకు ఇండస్ట్రీలో డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతుంది. ఆమెతో సినిమాలు చేసేందుకు కూడా దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..

‘టాక్సిక్’ మూవీలో నయనతార పాత్ర ఎలా ఉండబోతుంది?

భారీ రెమ్యూనరేషన్ తో నయనతార రికార్డ్

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. శరత్ కుమార్, రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలతో పాటుగా తెలుగులో కూడా స్టార్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈయన వయసు 41 ఏళ్లు.. ఇప్పటికీ కూడా చెక్కుచెదరని అందంతో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. మలయాళంలో పెట్రియడ్, డియర్‌ స్టూడెంట్‌ చిత్రాలు నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మన్నాంగట్టి సీన్స్‌ 1960, హాయ్, రాక్కాయి , మూక్కుత్తి అమ్మన్‌ 2 వంటి సినిమాలలో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.. ఈ ఏడాదిలోనే ఒక్కో సినిమా రిలీజ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఇకపోతే త్వరలోనే నయనతార తెలుగులో మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు అనౌన్స్ చెయ్యనుందని టాక్..

నయనతార తన టాలెంట్ మరియు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ‘టాక్సిక్’ మూవీలో ఆమె నటన ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.