
📌 Key Points
- చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన చిత్రం ‘నీలకంఠ’.
- హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
- రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలయ్యింది.
- విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ప్రేమ, శిక్ష అంశాలు ప్రధానం.
చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ హీరోగా, స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చిన నీలకంఠ చిత్రం రివ్యూ కోసం ఎదురుచూస్తున్నారా? విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో, నటీనటుల ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం.
నీలకంఠ కథాంశం, స్క్రీన్‌ప్లే ఎలా ఉంది?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన సినిమా నీలకంఠ. హీరోయిన్ స్నేహ ఉల్లాల్ చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జనవరి 2) థియేటర్లలో నీలకంఠ మూవీ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నీలకంఠ రివ్యూలో చూద్దాం.
నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, యష్ణ ముతులూరి, నేహా పఠాన్, స్నేహ ఉల్లాల్, రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం: రాకేష్ మాధవన్
ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్
నిర్మాతలు: మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్
నటీనటుల ప్రదర్శన, వారి పాత్రలు
ప్రొడక్షన్ బ్యానర్: ఎల్ఎస్ ప్రొడక్షన్స్
విడుదల తేది: జనవరి 2, 2026
టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి నటించిన లేటెస్ట్ సినిమా నీలకంఠ. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. యష్ణ ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్స్‌గా చేసిన నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.
ట్రైలర్, టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న నీలకంఠ సినిమా ఇవాళ (జనవరి 2) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందో నేటి నీలకంఠ రివ్యూ లో తెలుసుకుందాం.
దాని ఫలితంగా 15 సంవత్సరాలు ఊరు నుంచి బయటికి పోకుండా ఉండాలని, ఇంకా ఎప్పుడు నీలకంఠ చదువుకోవడానికి వీలులేదని శిక్ష వేస్తారు. బాగా చదివ ఊరికి పేరు తీసుకొస్తా అని అమ్మకు ఇచ్చిన మాటను నెరవేర్చలేనందుకు బాధపడుతాడు నీలకంఠ. చదువుకు దూరమైన నీలకంఠ కబడ్డీ పోటీల్లో గెలుస్తాడు. కానీ, మండల స్థాయికి వెళ్లలేకపోతాడు.
దర్శకత్వం, సాంకేతిక విలువలు, ప్లస్సులు-మైనస్సులు
ప్రేమించిన సీత (యష్ణ ముతులూరి) కూడా చదువు నిమిత్రం విదేశాలకు వెళ్తుంది. ఈ క్రమంలో 15 ఏళ్లకు నీలకంఠ శిక్ష ముగుస్తుంది. ఆ తర్వాత నీలకంఠ ఏం చేశాడు? సీతను పెళ్లి చేసుకున్నాడా? సర్పంచ్‌గా నీలకంఠ ఎందుకు నిలుచున్నాడు? నీలకంఠ చేసిన తప్పు ఏంటీ? అమ్మకు ఇచ్చిన మాట నెరవేర్చాడా? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
కథ స్టార్ట్ అయినా పది నిమిషంలోనే మనకు ఆది అర్ధమవుతుంది. ఊరులో ఉండే జనం ఎంత ప్రేమగా ఉంటారో అంతే కఠినంగా ఉంటారు అనే విషయాన్ని బాగా చూపించారు. ఈ కథ నాన్ లినియర్ స్క్రీన్ ప్లేతో మొదలు అవుతుంది. దాని వాళ్ల నెక్ట్స్ ఎం జరుగుతుంది అని క్యూరియాసిటీ చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు కలుగుతుంది.
సెకండ్ హాఫ్ అంతా చాలా రేసీ స్క్రీన్‌ప్లేతో పరుగెడుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌ని చాలా కొత్తగా డిజైన్ చేసారు. ఊరులో జరిగే కబడ్డీ స్పోర్ట్స్‌ని బాగా చిత్రీకరిచారు. చివరి 30 నిముషాలు స్టోరీ పే అఫ్‌లు ఇచ్చిన విధానం చాల బాగా ఉంది. కథకు మెయిన్ ఇంటెన్షన్‌ని లాస్ట్‌లో కొత్తగా చూపించారు. క్లైమాక్స్ బాగుంది.
యష్న ముత్తులూరి సీత పాత్రలో చాలా సహజంగా నటించింది. స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్‌తో చేసింది. ఆమెకు ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందో చూడాలి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ రాంకీ చాలా రోజులకు తెలుగులో కనిపించారు. ఆయన యాక్టింగ్ డీసెంట్‌గా ఉంది. ప్రతి ఒక్కరు చాల సహజంగా నటించి మెప్పించారు.
మొత్తం మీద, నీలకంఠ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను మెప్పించేలా ఉంది. మహేంద్రన్, స్నేహ ఉల్లాల్ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కొన్ని లోపాలున్నా, సినిమా ఓవరాల్‌గా ఒకసారి చూడదగినదిగా నిలిచింది.


