|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక సంచలనం: రామ్ చరణ్ సినిమాపై మెగా డాటర్ క్లారిటీ! ఏం చెప్పారంటే?

Published: 20-03-2026, 6:05 AM
నిహారిక సంచలనం: రామ్ చరణ్ సినిమాపై మెగా డాటర్ క్లారిటీ! ఏం చెప్పారంటే?
  • నిహారిక నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై వెబ్ సిరీస్ లతో సక్సెస్.
  • రాకాసా సినిమా ప్రమోషన్స్ లో మెగా హీరోల సినిమాల గురించి నిహారిక కామెంట్స్.
  • వరుణ్ తేజ్ తో సినిమా ఉంటుందని చెప్పిన నిహారిక, రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ.
  • మంచి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపిన నిహారిక.

నిహారిక కొణిదెల నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రాకాసా సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగా హీరోల సినిమాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, వరుణ్ తేజ్ లతో సినిమాలు చేసే అవకాశం గురించి ఆమె మాట్లాడారు.

నిర్మాతగా నిహారిక సక్సెస్

Niharika Konidela: నిహారిక ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఈమె ఇదివరకు ఎన్నో వెబ్ సిరీలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం వెండితెర సినిమాలు చేస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక త్వరలోనే సంగీత శోభన్ హీరోగా నటించిన రాకాసా (Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు తన బ్యానర్లో మెగా హీరోల సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తన మొదటి సినిమా డైరెక్టర్ వంశీ తన అన్నయ్య వరుణ్ కోసం ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కథ సిద్ధం చేస్తున్నారని వరుణ్ తేజ్ తో తను తదుపరి సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఇకపోతే రామ్ చరణ్ కూడా నిహారికకు సినిమా చేస్తాను అంటూ మాట ఇచ్చారని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత అనే ప్రశ్న ఎదురైంది.

మెగా హీరోల సినిమాల గురించి ప్రశ్నలు

ఈ ప్రశ్నకు నిహారిక ఒక్కసారిగా షాక్ అవ్వుతూ అన్న పబ్లిక్ గా మాటిచ్చారా? అంటూ ఆశ్చర్యపోయారు. పబ్లిక్ గా కాదు కానీ మీ ఫ్యామిలీలోనే మీ బ్యానర్ లో సినిమా చేస్తానని మాట ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా? రాంచరణ్ మీ బ్యానర్ లో సినిమా చేయబోతున్నారా? అంటూ ప్రశ్న ఎదురు కావడంతో ఇప్పటివరకైతే అలాంటిదేమీ లేదని కాకపోతే చరణ్ అన్నతో సినిమా అయితే కచ్చితంగా చేస్తాను అంటూ నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా రాంచరణ్ తో కాకపోయినా త్వరలోనే వరుణ్ తేజ్ తో నిహారిక నిర్మాతగా సినిమా చేయబోతున్నారని స్పష్టమవుతుంది.

మంచి పాత్రలు వస్తే నటిస్తా…

నటిగా నిహారిక ఆసక్తి

నిహారిక సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో తనకంటూ ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని నిహారిక తెలిపారు. ఇప్పటివరకు చాలా కథలు వచ్చాయి కానీ తన పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఉండి కథలో కంటెంట్ లేకపోవడంతోనే తాను రిజెక్ట్ చేశానని మంచి పాత్రలు వస్తే తన అన్నయ్యల సినిమాలలో కూడా కచ్చితంగా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు , రామ్ చరణ్ పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మొత్తానికి రామ్ చరణ్ తో సినిమా గురించి స్పష్టత లేకున్నా, త్వరలోనే వరుణ్ తేజ్ తో సినిమా ఉంటుందని నిహారిక తెలిపారు. మంచి కథ వస్తే నటిగా కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.