|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ తో నిఖిల్ మల్టీస్టారర్ కల నెరవేరుతుందా? స్వయంభు హీరో మనసులో మాట!

Published: 11-02-2026, 6:05 AM
పవన్ కళ్యాణ్ తో నిఖిల్ మల్టీస్టారర్ కల నెరవేరుతుందా? స్వయంభు హీరో మనసులో మాట!
  • నిఖిల్ సిద్ధార్థ్ త్వరలో ‘స్వయంభు’ సినిమాలో యోధుడిగా కనిపించనున్నారు.
  • పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించాలని నిఖిల్ కోరిక.
  • నిఖిల్ నటించిన ‘స్వయంభు’ టీజర్ కు మంచి స్పందన లభించింది.
  • పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నారు.

హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిఖిల్ సిద్ధార్థ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం చేయాలనీ ఉంది అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ తో నటించాలనే కోరికను బయటపెట్టిన నిఖిల్

Nikhil Siddarth: నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హ్యాపీడేస్ సినిమా ద్వారా నటుడుగా ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన స్వయంభు(Swayambhu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిఖిల్ క్రీస్తు శకం 985 కాలానికి చెందిన యోధుడిగా కనిపించబోతున్నారు.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో టీజర్ వీడియో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక టీజర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక నిఖిల్ సినిమా కోసం పడిన కష్టాన్ని కూడా ఈయన గుర్తు చేసుకున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిఖిల్ మల్టీ స్టారర్ సినిమా చేయాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తారనే ప్రశ్న ఎదురయింది.

‘స్వయంభు’ టీజర్ విడుదల.. ఆసక్తికర విషయాలు వెల్లడి

ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం చెబుతూ తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరికగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవమని అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైన అవకాశం అంటూ నిఖిల్ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు. మరి నిఖిల్ కోరుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తుందా పవన్ ఈయనకు ఆ అవకాశాన్ని కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఏప్రిల్ 10న స్వయంభు రిలీజ్..

రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు రాజకీయ వ్యవహారాలలో కొనసాగుతూనే మరోవైపు పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కాబోతోంది అలాగే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఉగాది పండుగ తర్వాత రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించుకోబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇక నిఖిల్ స్వయంభూ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ సినిమా తిరిగి ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.

నిఖిల్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ సినిమాతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ జీవితంలో ముందుకు సాగుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.