
📌 Key Points
- చంద్రకళ తన నడుము అందాలతో విరాట్‌ను టెంప్ట్ చేయాలని ప్రయత్నించింది.
- శాలిని తన ప్లాన్‌లకు కెమెరా పెన్‌ను ఉపయోగించి నిజాలు బయటపెట్టింది.
- శృతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ వ్యవహారం గురించి చంద్రకళకు తెలుస్తుంది.
- కామాక్షి శృతికి విరాట్‌తోనే పెళ్లి అని గట్టి వార్నింగ్ ఇస్తుంది.
నిన్ను కోరి డిసెంబర్ 11 ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చంద్రకళ నడుము అందాలతో విరాట్‌ను టెంప్ట్ చేయగా, శాలిని కెమెరా పెన్ ముందు కీలక నిజాలు చెప్పింది. శృతి ప్రేమ వ్యవహారం బయటపడగా, కామాక్షి ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఆసక్తికర మలుపులు తెలుసుకుందాం.
చంద్రకళ టెంప్టేషన్, విరాట్‌ను ఆకర్షించిన నడుము అందాలు
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో కెమెరా పెన్‌ను నడుము దగ్గర పెట్టుకుని విరాట్‌ను టెంప్ట్ చేస్తుంది చంద్రకళ. ఇంతలో మేనేజర్ కాల్ చేసి రెండు లక్షలు కావాలంటే చంద్రకళ అరేంజ్ చేయిస్తానంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తావని తల్లిని శ్రుతి అడిగితే లాగిపెట్టి కొడుతుంది కామాక్షి.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి జాలి రాజ్ కాల్ చేస్తాడు. ఎక్కడ కలుద్దామని శ్రుతి అంటే.. పెళ్లి గురించి అడుగుతాడు రాజ్. ఏంటీ బేబీ చిరాకు పడుతున్నావ్ అని శ్రుతి మాట్లాడుతుంది. ఇంతలో చంద్రకళ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని శ్రుతి అంటే చంద్రకళ తెగ నవ్వుతుంది.
ఇదేదే మనకు వర్కౌట్ అయ్యేలా ఉందని శాలిని అనుకుంటుంది. నువ్ ఎంత ట్రై చేసినా కామాక్షి ఒప్పుకుంటుందని లేదుగా. తనింక నిన్ను విరాట్‌కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటుంది. అందుకే నేను ఎంకరేజ్ చేయలేదు. ముందు కామాక్షికి చెప్పు అని శాలిని అంటే చెబుతాను అని వెళ్లిపోతుంది శ్రుతి. శ్రుతి లవ్ మ్యాటర్ బయటపెట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేసి చంద్రపై నింద తోసేయాలి అని శాలిని అనుకుంటుంది.
కెమెరా పెన్‌లో శాలిని అసలు నిజాలు
మరోవైపు శ్రుతి తనతో బాయ్‌ఫ్రెండ్ అని వేలాకోలం ఆడుతుందని చంద్రకళ చెబుతుంది. పెన్ కెమెరా గురించి విరాట్ అడిగి భద్రంగా దాచిపెడతానంటాడు. పెన్‌ను నడుము దగ్గర పెట్టుకుంటుంది చంద్రకళ. అది చూసి పెన్ కెమెరా ఎంత అదృష్టం చేసుకుందని పొగుడుతాడు విరాట్. నడుము అందాలతో చంద్రకళ టెంప్ట్ చేస్తుంది. తర్వాత గిలిగింతలు పెట్టి చంద్రకళ నుంచి పెన్ తీసుకుంటాడు విరాట్.
విరాట్ బావతో పెళ్లి జరగడం సాధ్యం కాదు. బయట బావకు సరితూగే మనుషులు చాలా మంది ఉంటారు. అలా నేను ఏ అబ్బాయినైనా ప్రేమిస్తే ఏం చేస్తావని శ్రుతి అడుగుతుంది. దాంతో శ్రుతి చెంప పగులగొట్టి పదేళ్లయిన సరే విరాట్‌తోనే నీ పెళ్లి. ఎవరినైనా ప్రేమిస్తే ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది కామాక్షి. రాజ్‌ను ప్రేమించానని చెబితే కాళ్లు విరగొట్టేదేమో అని శ్రుతి అనుకుంటుంది.
శృతి ప్రేమ రహస్యం, కామాక్షి షాకింగ్ వార్నింగ్
రాజ్ లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ నా ప్రేమలో పడ్డానని తెలిస్తే అందరి షాక్ అవుతారు. నా వాల్యూ ఏంటో అమ్మకు తెలిసేలా చేస్తానని శ్రుతి అనుకుంటుంది. శాలిని ఫోన్ మాట్లాడే ప్లేసలో చంద్రకళ పెన్ కెమెరా ఫిక్స్ చేస్తుంది. అక్కడికి శాలిని వచ్చి మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి చంద్రకళ వస్తుంది. నీకు దొరికేలా ఏం చేయను అని శాలిని అంటుంది.
మరోవైపు పెన్ కెమెరా ముందు శాలిని తల్లి గురించి తప్పుగా మాట్లాడి రెచ్చగొడుతుంది చంద్రకళ. దాంతో అంతా తానే చేస్తున్నట్లు ఒప్పుకుంటుంది శాలిని. అదంతా రికార్డ్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో శాలిని ప్లాన్‌లు, చంద్రకళ అందాల ప్రదర్శన, శృతి ప్రేమకథలో ఎదురైన అవాంతరాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


