
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే రూ.180 కోట్ల బిజినెస్ చేసింది.
- నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
- ఆడియో హక్కులు రూ.50 కోట్లకు అమ్ముడయ్యాయి.
- థియేట్రికల్ వసూళ్లను బట్టి డిజిటల్ డీల్‌లో బోనస్ క్లాజులు ఉన్నాయి.
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. డిజిటల్, ఆడియో హక్కుల ద్వారా భారీ మొత్తాలను వసూలు చేస్తూ, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం
Peddi OTT: రామ్ చరణ్ ..ఇతడికి,ఇతగాడి సినిమాలకి మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇపుడు అదే దాన్నే మరోసారి ప్రూవ్ చేస్తుంది పెద్ది. యస్ ..‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న పూర్తి స్థాయి రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి రాకముందే సరికొత్త సంచలనాలకు తెరతీస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ చేతికి డిజిటల్ హక్కులు
బోనస్ క్లాజులతో భారీ డీల్
ఈ డీల్‌లో చేర్చిన సరికొత్త ‘బోనస్ క్లాజులు’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా థియేటర్లలో సాధించే వసూళ్ల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల మైలురాయిని దాటితే ఒక రకమైన బోనస్, అలాగే అత్యంత కీలకమైన హిందీ మార్కెట్‌లో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటే ఒక స్థాయి, ఒకవేళ రూ.200 కోట్లు దాటితే మరో భారీ స్థాయి అదనపు చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదిరిందట. దీనివల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఫైనల్ ఓటీటీ డీల్ విలువ రూ.130 కోట్ల నుండి చాలా సులభంగా రూ.160 కోట్లకు పైగా దాటే అవకాశం కనిపిస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమా ఆడియో హక్కులు కూడా దాదాపు రూ.50 కోట్లకు పైగా పలికినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించడం పక్కా రామ్ చరణ్ గత చిత్రాల బిజినెస్‌తో పోల్చి చూస్తే ఈ రేంజ్ మార్కెట్ ఊహించినదే అని చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ డిజిటల్ హక్కులను గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.160 కోట్లకు పైగా రికార్డు ధరకు దక్కించుకుంది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా బేస్ ప్రైస్ రూ.130 కోట్లుగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మెన్స్ బాగుంటే వచ్చే అదనపు బోనస్‌లతో కలిపి ఇది ‘గేమ్ ఛేంజర్’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న థియేటర్లు దద్దరిల్లడం, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవడం ఖాయమని మెగా అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ సినిమా ఊహించిన విధంగా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, మాత్రం అటు థియేట్రికల్ కలెక్షన్లతో పాటు ఇటు ఓటీటీ బిజినెస్‌లోనూ ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించడం పక్కా !
మొత్తంగా, ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే సాధించిన ఈ భారీ వసూళ్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. రామ్ చరణ్ స్టార్‌డమ్, బుచ్చిబాబు సానా దర్శకత్వం సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి.


