
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో, చంద్రకళ ప్రమాదంలో పడుతుంది. కానీ, అర్జున్ మరియు విరాట్ ఆమెను కాపాడతారు. శ్యామల మరియు కామాక్షి పూజను చెడగొట్టడానికి ప్రయత్నించగా, జగదీశ్వరి వారిని అడ్డుకుంటుంది.
Key Points
అర్జున్ చంద్రకళను ప్రమాదం నుండి కాపాడతాడు.
విరాట్ మరియు చంద్రకళ పూజలో కలిసి పాల్గొంటారు.
శ్యామల మరియు కామాక్షి పూజను భంగపరచడానికి ప్రయత్నిస్తారు.
జగదీశ్వరి శ్యామల మరియు కామాక్షిని అడ్డుకుంటుంది.
అర్జున్-విరాట్ ధైర్యసాహసాలు
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కొద్దిరోజుల్లో నువ్వే ఇంట్లోంచి వెళ్లిపోతున్నావ్. ఇప్పుడు అతిథి సత్కారాలు అవసరమా అని గట్టిగా మాట్లాడుతుంది శ్యామల. అది అర్జున్, విరాట్ వింటూ ఉంటారు. వెంటనే వెళ్లి అత్తయ్య మన ఇంట్లో గొడవలు బయటివాళ్లకు తెలియకుంటే మంచిది. అతని ముందు కాస్తా నార్మల్‌గా ప్రవర్తించండి అని విరాట్ అంటాడు.
దాంతో పెళ్లానికి వత్తాసు పలకడానికి రెడీగా ఉంటావని వెళ్లిపోతుంది శ్యామల. చంద్ర మేము పైకి వెళ్లి మాట్లాడుకుంటాం. కాఫీ అక్కడికే తీసుకురా అని విరాట్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న తల్లీకూతురు పైన మెట్లపై పడేలా వైర్ కడతారు. చంద్రకళ పైకి వస్తుంది. తనకు ఎదురుగా విరాట్, అర్జున్ వస్తారు. వైర్‌ను చూసిన అర్జున్ చంద్రకళను ఆగమంటాడు.
వైర్ తీస్తాడు అర్జున్. అయినా ఇలా దారిలో పెట్టుంటారు అని అర్జున్ అడుగుతాడు. బిజినెస్ పార్టనర్ వచ్చాడని కళ్లు మూసుకుపోయేలా నడిస్తే ఎలా అని శ్యామల అంటుంది. కామాక్షీ కూడా అతని చుట్టూనే తిరిగితే ఎలా అని అంటుంది. దాంతో జగదీశ్వరి కామాక్షిని వారిస్తుంది. పూజ ప్రశాంతంగా జరుపుకోనివ్వు అంటుంది. తర్వాత వెళ్లిపోతానని విరాట్‌కు చెబుతాడు అర్జున్.
మా అత్త వాళ్లు అన్నది పట్టించుకోకండి. వాళ్ల మాట తీరే అంతా. మీరున్నారని చంద్రకళ ఊరుకుంది. కానీ, అక్కడికక్కడే మాటకు మాట ఇచ్చేది. ఇది ఒక ఫ్యామిలీ రొమాన్స్ లాంటిది. వాళ్ల మాటలను సీరియస్‌గా కాకుండా ఫన్‌లా చూడండి. మంచి ఎజాయ్‌మెంట్ వస్తుందని. ఇంట్లో ఏం జరిగిన నా దాకా చంద్ర తీసుకురాదు అని విరాట్ చెబుతాడు.
శ్యామల-కామాక్షి కుట్రలు
ఆఫీస్‌లో కూడా చాలా బాగా డీల్ చేస్తుందని చంద్రకళను పొగుడుతాడు అర్జున్. కాబట్టి, హ్యాపీగా భోజనం చేసి వెళ్లండని అర్జున్‌కు విరాట్ చెబుతాడు. మరోవైపు కలశం తీసుకురాలేదే అని శాలిని వెళ్లిపోతుంది. పూజకు అన్ని ఏర్పాటు అయినట్లు ఉన్నాయి. విగ్రహం పెడదామని చంద్రకళ తీసుకొస్తుంది. ఆగమని శ్యామల అరుస్తుంది. నువ్వెందుకు విగ్రహం తీసుకొచ్చి పెడుతున్నావ్. నువ్ ఈ పూజలో ఉండకూడదు అని శ్యామల అంటుంది.
శాలినికి ఇవ్వమని చెబుతుంది. దాంతో చంద్రకళ విగ్రహం ఇస్తుంది. శాలిని పెడుతుంది. ఫొటోలు తీస్తు తీస్తూ చంద్రకళను పక్కకు నెడుతుంది శ్రుతి. చంద్రకళను అవమానిస్తుంది. మీ ఫ్యామిలీలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని చంద్రకళ పెట్టే పచ్చళ్లతో పోలుస్తాడు అర్జున్. దాంతో చంద్రకళ నవ్వుతుంది. ఇద్దరు నవ్వుకోవడం అంతా చూస్తారు.
పంతులు విరాట్, చంద్రకళను పూజలో కూర్చోమంటాడు. వాళ్లు కాదని శ్యామల చెబుతుంది. పెద్దవాళ్లు ఉండగా చిన్నవాళ్లను కూర్చొబెడుతున్నారేంటీ అని పంతులు అంటాడు. చంద్రకళ కవర్ చేస్తుంది. కానీ, పూర్వీకుల ఆచారం తప్పకూడదుగా. మీరు అందుబాటులో లేకుంటే తప్ప పెద్దవాళ్లు ఉండగా చిన్నవాళ్లు కూర్చోని చేయడం పద్ధతి కాదు అని పంతులు అంటాడు.
పూజలో ఉద్రేకాలు
వాళ్లతోనే పూజ చేయండి అని శ్యామల గట్టిగా చెబుతుంది. ఆలోచించుకోండి అమ్మ. మీ మంచికే చెబుతున్నా అని పంతులు అంటాడు. శ్యామల మళ్లీ ఏదో చెప్పబోతుంటే ఆగమంటుంది జగదీశ్వరి. పంతులు గారు అలా పదే పదే చెబుతున్నారంటే దానికి పరమార్థం ఉంది. విరాట్, చంద్రకళను పూజలో కూర్చోనివ్వు అని జగదీశ్వరి చెబుతుంది. శాలిని ఈర్శ్యగా చూస్తుంది.
క్రాంతి చూడగానే సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది శాలిని. చంద్ర మీరు పూజ చేయండని శాలిని అంటే పేరుకు పెద్ద కోడలు అయినా ఇద్దరం కలిసి పూజ చేద్దామని చంద్ర అంటుంది. దాంతో పెత్తనం చేయకుండా అందరిని కలుపుకుని పోతున్నారు. హ్యాట్సాఫ్ అని అర్జున్ పొగుడుతాడు. విరాట్‌కు పంచె కట్టుకోవడం రాదంటే అర్జున్ నేర్పిస్తానని కట్టిస్తాడు.
తర్వాత రఘురాంను అర్జున్ చూసి ఎవరంటే మా ఫాదర్ అని చెప్పి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు విరాట్. జరిగింది చెబుతాడు. విరాట్, అర్జున్ కిందకు వస్తారు. వర్క్‌కు సంబంధించినవి ఏమైనా వస్తువులు పెట్టుకోండని పంతులు చెబితే.. చంద్ర కొత్త ప్రాజెక్ట్ ఫైల్ పెడుతుంది. ఒక్కొక్కరు ఒక్కోటి పెడతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి, పూజ సజావుగా జరుగుతుంది. అర్జున్ మరియు విరాట్ చంద్రకళను కాపాడటంతో, శ్యామల మరియు కామాక్షి ప్రయత్నాలు విఫలమవుతాయి. జగదీశ్వరి కుటుంబ సమగ్రతను కాపాడుతుంది.


