|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nithin: ‘తమ్ముడు’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమ్.. హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందంటూ హైప్ పెంచిన ట్వీట్

Published: 15-06-2025, 6:02 AM
Nithin: ‘తమ్ముడు’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమ్.. హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందంటూ హైప్ పెంచిన ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. చిత్ర బృందం ‘భూ అంటూ భూతం’ అనే పాటను జూన్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Key Points

1

నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా నుంచి ‘భూ అంటూ భూతం’ పాట విడుదల

2

జూన్ 17న సాయంత్రం 5 గంటలకు పాట విడుదల

4

నితిన్ మరియు ఓ చిన్నారితో క్యూట్ పోస్టర్ విడుదల

‘తమ్ముడు’ నుంచి పాట విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) గత ఏడాది ‘రాబిన్‌హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ మార్చి 28న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం నితిన్ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda)హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హిట్ మూవీ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..జూలై 4ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ మూవీ నుంచి భూ అంటూ భూతం సాంగ్ విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పాట జూన్ 17న సాయంత్రం 5గంటలకు రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నితిన్ ఓ చిన్నారితో ఉన్న క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు. అలాగే ఈ పాట చిన్నాకుల హృదయాలల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుందనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు.

జూన్ 17న ‘భూ అంటూ భూతం’ పాట రిలీజ్

చిత్ర బృందం నుండి హైప్

చిన్నారుల హృదయాలను దోచుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతున్న ‘భూ అంటూ భూతం’ పాటతో ‘తమ్ముడు’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జూలై 4న విడుదల కానున్న ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.