
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా నుంచి మరో ఆకర్షణీయమైన పాట విడుదలైంది. ‘వాషి యో వాషి’ అనే జపనీస్ హైకూ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ పాట సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
Key Points
పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో జపనీస్ హైకూ పాట పాడారు.
వాషి యో వాషి పాట సెప్టెంబర్ 19న విడుదలైంది.
ఓమి (ఇమ్రాన్ హష్మి)ని ఉద్దేశించి పవన్ పాడిన హెచ్చరిక పాట.
ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
పవన్ కల్యాణ్ జపనీస్ హైకూ పాట
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో పండగలాంటి సాంగ్ వచ్చేసింది. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఓజీ మూవీలో పవన్ స్వయంగా పాడిన వాషి యో వాషి అనే జపనీస్ హైకూ రావడం విశేషం. తమన్ డిఫరెంట్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తన సినిమాల్లో పాటలు పాడే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్ .. ఇప్పుడు రాబోతున్న ఓజీ మూవీలోనూ ఓ పాట పాడాడు. అయితే అది జపనీస్ హైకూ (చిన్న కవిత) కావడం విశేషం. ఈ సాంగ్ ను శుక్రవారం (సెప్టెంబర్ 19) మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీలో విలన్ అయిన ఓమి (ఇమ్రాన్ హష్మి)ని ఉద్దేశించి ఓజీ ఓ వార్నింగ్ ఇస్తూ పాడే పాట ఇది.
ఓజీ సినిమా ప్రమోషన్స్
“ఓమి మై డియర్ ఓమి.. ఎగరెగిరి పడుతున్నావ్.. నీలాంటి వాళ్లను నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు.. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతాను విను.. వాషి యో వాషి” అంటూ ఇది సాగిపోయింది. పవన్ తనదైన స్టైల్లో ఈ మాటలు చెబుతున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 52 సెకన్ల పాటు సాగిన సాంగ్ ఇది. ఇందులో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ కూడా జోడించారు.
సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీ మూవీ సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. జులైలో వచ్చిన హరి హర వీరమల్లు దారుణంగా బోల్తా పడటంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ ఓజీ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లే ప్రమోషనల్ కంటెంట్ ఉంది. ఈ ఓజీ ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో ఓమి అనే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు
ఈ సినిమా ప్రీమియర్లు కూడా ఉండబోతున్నాయి. అది కూడా రూ.1000 టికెట్ కావడం విశేషం. గత మంగళవారమే (సెప్టెంబర్ 16) చాలా చోట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సేల్స్ లో ‘ఓజీ’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. మెల్ బోర్న్ లో ఉన్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో ఓజీ టికెట్లు రెండు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాల్లో ఓజి మూవీ మెల్బోర్న్ ఐమాక్స్ షో ఎలా అమ్ముడయ్యిందో ఫ్యాన్స్ ఎక్స్ లో పంచుకున్నారు.
చివరగా, పవన్ కల్యాణ్ అభిమానులకు ‘వాషి యో వాషి’ పాట పండగే. ఓజీ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.


