|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Om Shanthi Shanthi Shanthi Teaser : ఓం శాంతి టీజర్ అవుట్.. అసలేం మార్చారంటే?

Published: 08-12-2025, 8:48 AM
Om Shanthi Shanthi Shanthi Teaser : ఓం శాంతి టీజర్ అవుట్.. అసలేం మార్చారంటే?
  • తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా టీజర్ విడుదలైంది.
  • ఇది మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ జయహే’ సినిమాకు అధికారిక రీమేక్.
  • తెలుగు వెర్షన్‌లో కథనంలో, తరుణ్ భాస్కర్ ‘ఓంకార్ నాయుడు’ పాత్రలో చాలా మార్పులు జరిగాయి.
  • ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ కెమిస్ట్రీ టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జయ జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ ను బట్టి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథనంలో, ముఖ్యంగా తరుణ్ భాస్కర్ పాత్రలో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

తరుణ్ భాస్కర్ ప్రస్థానం – పెళ్లిచూపుల నుండి నటుడిగా

Om Shanthi Shanthi Shanthi Teaser : పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. విజయ్ నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయాడు విజయ్ దేవరకొండ. అప్పటినుంచి చిన్న సినిమాలు కూడా విపరీతమైన పేరు వచ్చింది. అన్నిటిని మించి తెలంగాణ యాసను ఆ సినిమాలో డిజైన్ చేసిన విధానం చాలామందికి కొత్త మందికి అనిపించింది. అంతకుముందు ఎక్కువ సందర్భాల్లో కేవలం కామెడీగా మాత్రమే ఆ యాసను వాడేవాళ్లు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఆ యాసకు గౌరవాన్ని తెచ్చేలా ఆ సినిమాను డిజైన్ చేశాడు.

పెళ్లిచూపులు సినిమా అయిపోయిన తర్వాత కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా నటుడుగా కూడా తరుణ్ భాస్కర్ చాలా సినిమాలను చేశాడు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ చేసిన అన్ని సినిమాల్లో కూడా తెలంగాణ యాసనే మాట్లాడేవాడు. తరుణ్ భాస్కర్ హీరోగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా జనవరి 23న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసింది.

మలయాళం లో బాగా సూపర్ హిట్ అయిన సినిమా జయ జయ జయ జయ జయహే. దర్శన రాజేంద్రన్, బసీల్ జోసెఫ్ కలిసి నటించిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించింది ప్రస్తుతం ఈ సినిమా హాట్స్టార్ లో కూడా ఉంది.

రీమేక్ కథనం – మలయాళం హిట్ నుండి తెలుగు మార్పులు

ఇదే సినిమాను తెలుగులో ఓం శాంతి శాంతి శాంతి అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే చాలా మార్పులు జరిగాయి అని క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారు.

ఓంకార్ నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. క్రికెట్ మీద అవగాహన లేకపోయినా కూడా క్రికెట్ గురించి మాట్లాడటం. అలానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన చాలా ట్రోలింగ్ మీమ్స్ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.

టీజర్ హైలైట్స్ & రిలీజ్ అంచనాలు

జయ జయ జయ జయ జయహే సినిమాలో జోసెఫ్ మరియు దర్శన రాజేంద్రన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నీకు తెలుగులో కూడా ఈషా రెబ్బ మరియు తరుణ్ భాస్కర్ కెమిస్ట్రీ కూడా బానే వర్కౌట్ అయింది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అతనికి 23వ తారీకు రిలీజ్ కాబోయే సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.

మొత్తంగా, ‘ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మలయాళంలో విజయవంతమైన కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి, జనవరి 23న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.