
📌 Key Points
- ఓపెన్ఏఐ సొంత AI స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది.
- ఈ ఫోన్ సాంప్రదాయ యాప్‌ల అవసరం లేకుండా అన్ని పనులు చేస్తుంది.
- AI ఏజెంట్లపై ఆధారపడి సంక్లిష్టమైన టాస్కులను పూర్తి చేస్తుంది.
- విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం, 2028 ప్రారంభంలో విడుదల కావచ్చు.
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఓపెన్‌ఏఐ సంచలనం సృష్టించబోతోంది. త్వరలో సొంత AI స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ యాప్‌ల అవసరం లేకుండానే అన్ని పనులను స్వయంగా పూర్తి చేస్తుందని, మొబైల్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుందని అంచనా.
ఓపెన్‌ఏఐ AI ఫోన్: మార్కెట్‌లో కొత్త విప్లవం
OpenAI Smartphone : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. రాబోయే రోజుల్లో కొత్త ఏఐ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఓపెన్ఏఐ కంపెనీ సొంత స్మార్ట్‌ఫోన్ డెవలప్ చేసేందుకు రెడీ అవతోంది. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా అన్ని పనులను స్వయంగా ఈ ఏఐ ఫోన్ పూర్తిచేస్తుంది.
ఈ ఏఐ ఫోన్‌లో సంక్లిష్టమైన పనులను సైతం క్షణాల్లో పూర్తి చేయగలదు. అనేక ఏఐ సపోర్టు యాప్‌లు ఉండవచ్చు. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అతిపెద్ద విప్లవాన్ని క్రియేట్ చేస్తుంది. ఓపెన్ఏఐ ఏఐ ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చాట్‌జీపీటీ రూపొందించిన ఓపెన్ ఏఐ కంపెనీ.. సొంత స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఏఐ ఏజెంట్లపై ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ యాప్‌ల కన్నా ఇందులో ఎక్కువ సంఖ్యలో ఆటోమేటెడ్ ఏజెంట్లు ఉండవచ్చు. విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. ఈ ఓపెన్ఏఐ స్మార్ట్‌ఫోన్ 2028 ప్రారంభంలోనే మార్కెట్లోకి రావచ్చు.
Read Also : OnePlus Nord CE 6 Series : కొత్త వన్‌ప్లస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. మే 7నే లాంచ్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
యాప్‌లు లేకుండానే అన్ని పనులు AIతో
ఇతర యాప్స్ అవసరం లేదు.. అన్ని పనులు ఏఐనే : అయితే, ఈ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓపెన్ఏఐ నుంచి వస్తున్న ఈ ఫోన్ ఏఐ ఏజెంట్ అని చెప్పొచ్చు. ఇందులో మీడియాటెక్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌లు ఉంటాయి. అయితే, ఈ ప్రాసెసర్‌లు ప్రత్యేకంగా ఏఐ సపోర్టు కోసమే రూపొందుతాయి. ఏఐ ఫోన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
Two recent signals that align with my view:
OpenAI CEO Sam Altman @sama https://t.co/xBPmuLuDsy “…to seriously rethink how operating systems and user interfaces are designed… there should be a protocol that is equally usable by people and agents.”
GeekPark @GeekParkHQ … https://t.co/wtumZ4WIKz
2028లో ఓపెన్‌ఏఐ స్మార్ట్‌ఫోన్ లాంచ్?
— 郭明錤|Ming-Chi Kuo (@mingchikuo) April 28, 2026
ఇతర ట్రెడిషనల్ యాప్‌ల మాదిరిగానే ఇందులో కూడా చాట్ జీపీటీ వంటి యాప్‌లు ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఈ ఏఐ ఫోన్ అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. యూజర్లు వేర్వేరు యాప్‌లను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ స్వయంగా అన్ని పనులను పూర్తి చేస్తుంది.
భవిష్యత్తులో మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని పనులకు యాప్స్ అవసరం ఉండదు. అన్ని పనులు ఏఐనే చేసేస్తుంది. టాస్క్ ఏజెంట్ల ద్వారా ఆటోమాటిక్‌గా పూర్తి అవుతాయి. ఉదాహరణకు.. ఒక అపాయింట్‌మెంట్ రిక్వెస్ట్ కోసం ఏఐ ఏజెంట్ క్యాలెండర్‌లు, మెసేజ్, వెబ్ సెర్చ్ నుంచి సమాచారాన్ని అదే లింక్ చేసి ఆపై ఆప్షన్లను సూచిస్తూ నేరుగా బుకింగ్ చేస్తుంది.
ఇలాంటి ఏఐ ఏజెంట్ స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగ విధానాన్ని మార్చేయనుంది. ఇందులో యాప్ అవసరం పూర్తిగా ఉండకపోవచ్చు. బుకింగ్ లేదా క్యాలెండర్ యాప్‌లు ఉండకపోవచ్చు.
ఓపెన్‌ఏఐ AI స్మార్ట్‌ఫోన్ నిజంగా వస్తే, అది టెక్ ప్రపంచంలో ఒక మైలురాయి అవుతుంది. యాప్‌ల ఆధారిత వ్యవస్థ నుండి AI ఏజెంట్ల వైపు మారడం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. భవిష్యత్తు మొబైల్ టెక్నాలజీకి ఇది నాంది పలకవచ్చు.


