
📌 Key Points
- WWDC 2026లో ఆపిల్ సిరిని సిరి AIగా అప్‌గ్రేడ్ చేసింది.
- ఇది మెసేజ్‌లు, ఫొటోలు, ఇమెయిల్‌లను అర్థం చేసుకోగలదు.
- సిరి AI ఇప్పుడు మనుషుల్లాగే సహజంగా మాట్లాడగలదు.
- ఆపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తూ ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుంది.
WWDC 2026లో ఆపిల్ తన సిరిని సిరి AIగా అప్‌గ్రేడ్ చేసింది. ఇది కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, మెసేజ్‌లు, ఫొటోలు, ఇమెయిల్‌లను అర్థం చేసుకుని, మనిషిలా మాట్లాడగలదు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ కొత్త సిరి, యూజర్ల పనులను సులభతరం చేస్తుంది.
సిరి AI: కొత్త ఫీచర్లు ఏమిటి?
WWDC 2026 Siri AI : ఆపిల్ సిరి యూజర్లకు గుడ్ న్యూస్.. సిరి మరింత అడ్వాన్స్‌గా మారింది. WWDC 2026లో ఆపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరిని ఫుల్ అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై సిరి ఏఐగా అందుబాటులో ఉంటుంది. కేవలం యూజర్ల ప్రశ్నలకు ఆన్సర్ చేయడమే కాదు.. మెసేజ్, ఫొటోలు, ఇమెయిల్‌లు, యాప్ డేటాను ఈజీగా అర్థం చేసుకోగలదు. తద్వారా వివిధ పనులను కూడా ఆటోమాటిక్‌గా పూర్తిచేయగలదు.
ఆపిల్ సిరి ఏఐ కోసం కొత్త ప్రత్యేక యాప్, డైనమిక్ ఐలాండ్ (WWDC 2026 Siri AI) ఇంటిగ్రేషన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆపిల్ WWDC 2026 సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించగా, కంపెనీ రాబోయే సాఫ్ట్‌వేర్ ఏఐ అప్‌డేట్‌లపై ఆయన సూచనలు ఇచ్చారు. iOS 27, ఆపిల్ ఇంటెలిజెన్స్, కొత్త సిరి ఏఐతో సహా అనేక కీలక ఫీచర్లను ప్రకటించారు. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
సిరికి సిరి ఏఐకి తేడా ఏంటి? : ఆపిల్ అధికారికంగా సిరికి రీబ్రాండింగ్ చేసి సిరి ఏఐగా పేరు మార్చింది. కంపెనీ ప్రకారం.. ఈ కొత్త అసిస్టెంట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. గతంలో కన్నా యూజర్లకు అవసరమైన అన్ని పనులను ఈజీగా పూర్తిచేయగలదు. 2024లో సిరి ఆవిష్కరణ తర్వాత ఇదే మెయిన్ అప్‌గ్రేడ్. ఇప్పుడు సిరి ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలే కాదు యూజర్ల అవసరాలను అర్థం చేసుకుని హెల్ప్ కూడా చేస్తుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో ఏఐ ఫీచర్లు : ఆపిల్ ఫౌండేషన్ మోడల్ రెండో వెర్షన్ కూడా ప్రకటించింది. కంపెనీ ప్రకారం.. ఈ కొత్త మోడల్ వాయిస్‌ను అర్థం చేసుకోగలదు. టెక్స్ట్‌ను చదవగలదు. ఫొటోలను కూడా ఎక్స్ ప్లోర్ చేయగలదు. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను ప్లాట్‌ఫామ్‌లో డీప్ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా సిస్టమ్-లెవల్ ఏఐ ఫీచర్లు అడ్వాన్స్‌గా మారాయి. కొన్ని కంపెనీలు కేవలం ఏఐ కోసమే ఏఐని డెవలప్ చేస్తున్నాయి. వ్యక్తిగత డేటా ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని సిరి ఏఐ యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆపిల్ చెబుతోంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి AI అనుసంధానం
Read Also : WWDC 2026 : ఐఫోన్ 11 యూజర్లకు పండగే..! iOS 27 అప్‌డేట్, Siri AI సపోర్ట్.. మీ ఫోన్ లిస్ట్‌లో ఉందా?
సిరి ఏఐ ఇకపై మనుషుల్లాగే మాట్లాడగలదు : సిరి ఏఐ ఫీచర్ ఇప్పుడు మనుషుల్లాగే మాట్లాడగలదు. ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కొత్త వాయిస్ ఇంజిన్ కూడా ఉంది. సిరి వాయిస్‌ను నేచురల్ హ్యుమన్ వాయిస్ మాదిరిగా వినిపిస్తుంది. యూజర్లు ఏది అడిగినా సందర్భానుసారంగా సమాధానాలను ఇస్తుంది. అవసరమైతే ఈ ఫీచర్ సాయంతో ఒక టూర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్‌పై ఫీడ్‌బ్యాక్ పొందవచ్చు. ఆపిల్ ఇప్పుడు సిరి ఏఐని మరింత అడ్వాన్స్ ఫీచర్లతో అందిస్తుంది.
ఇప్పుడు డైనమిక్ ఐలాండ్‌పై కిందికి స్వైప్ చేసి సైడ్ బటన్‌ను ట్యాప్ చేయడం లేదా ‘Hey Siri’ అంటే చాలు.. సిరి ఏఐని నేరుగా యాక్టివేట్ చేస్తుంది. ప్రారంభ సెటప్ సమయంలో యూజర్లు అవసరానికి అనుగుణంగా వాయిస్‌లో చిన్న మార్పులు చేసుకోవచ్చు.
సిరి ఏఐ ఇకపై కేవలం కమాండ్స్ వినే అసిస్టెంట్ కాదు.. కన్వర్జేషన్ సందర్భాన్ని అర్థం చేసుకుని రెస్పాన్స్ అయ్యే డిజిటల్ అసిస్టెంట్ అని కూడా ఆపిల్ చెబుతోంది. కొత్త ఇంటర్‌ఫేస్ మరింత అడ్వాన్స్ గా ఈజీగా మారింది.
సిరి AI ఇక మనిషిలాగే మాట్లాడుతుందా?
సిరి ఏఐ ఫోటోలు, మెసేజ్, ఈమెయిల్స్ చదవగలదు : ఆపిల్ ప్రకారం.. సిరి ఏఐ ఇప్పుడు యాప్‌ల మధ్య డేటాను ఒకేచోట అందించగలదు. ఉదాహరణకు.. సిరి ఏఐ ఫొటోలోని ప్రాంతాన్ని గుర్తించి ఎలా వెళ్లాలో కూడా చెబుతుంది. ఫ్యామిలీ టూర్ ఫోటోలను గుర్తించి షేర్డ్ ఆల్బమ్‌లో పెట్టగలదు.
సిరి ఏఐ మెసేజ్ హిస్టరీ నుంచి డెజర్ట్ వివరాలను సేకరించి పార్టీ మెనూగా మార్చగలదు. ఆపై కాంటాక్ట్‌లకు కూడా మెసేజ్ పంపవచ్చు. మెసేజ్‌లో పంపిన డేటా ఆధారంగా సిరి ఏఐ ఏకంగా పూర్తి ఈమెయిల్ రూపొందించింది.
కొత్త సిరి యాప్, మ్యాక్‌కు అప్‌గ్రేడ్‌లు : ఆపిల్ సిరి ఏఐ కోసం స్పెషల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో యూజర్లు పాత కన్వర్జేషన్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. పాత చాట్ దగ్గరే కొత్త చాట్ చేయొచ్చు. మొత్తం చాట్ హిస్టరీ ఐక్లౌడ్ ద్వారా సింక్ అవుతుంది.
తద్వారా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ఆపిల్ వాచ్ మధ్య కన్వర్జేషన్ ఈజీ అవుతాయి. మ్యాక్‌లోని స్పాట్‌లైట్ సెర్చ్‌తో కూడా సిరి ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు, ఏదైనా ఫైల్ లేదా విండోపై రైట్-క్లిక్ చేస్తే సిరి ఏఐని యాక్టివేట్ చేయొచ్చు. విజన్ ప్రో యూజర్లు సిరి ఏఐ 3D విజువల్ ఇంటర్‌ఫేస్ కూడా పొందొచ్చు. వర్చువల్ స్పేస్‌లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు.
ఆపిల్ సిరి AI అప్‌గ్రేడ్‌తో, వర్చువల్ అసిస్టెంట్‌ల సామర్థ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యక్తిగత డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూనే, యూజర్లకు మరింత మెరుగైన, సహజమైన అనుభవాన్ని అందించడానికి ఇది సిద్ధంగా ఉంది.


