
📌 Key Points
- తాటి ముంజల్లో 85-90% నీరు ఉంటుంది, వేసవిలో డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.
- 100 గ్రాముల తాటి ముంజల్లో 40 కేలరీలు, 10 గ్రాముల పిండిపదార్థం ఉంటాయి.
- మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒకటి రెండు తాటి ముంజలు తినవచ్చు, కానీ పరిమితంగా తీసుకోవాలి.
- బరువు తగ్గాలనుకునేవారు తాటి ముంజలను మితంగా తీసుకోవడం మంచిది, కడుపు నిండిన భావన కలుగుతుంది.
వేసవి తాపానికి తాటి ముంజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చో లేదో తెలుసుకుందాం.
తాటి ముంజలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయా?
వేసవిలో రోడ్ల మీద తాటి ముంజలు అమ్మడం చూస్తుంటాం. పల్లెటూర్లలో అయితే తాటి ముంజలకు ఇబ్బంది ఉండదు. కానీ సిటీల్లో మాత్రం రోడ్ల మీద ఆగి కొనుక్కోవాలి. ఎలాంటి రసాయనాలు లేకుండా తాటి చెట్టుకు ఇవి కాస్తాయ్. వేసవిలో ఈ తాటి ముంజలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తాటి ముంజల పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. పోషకాల పరంగా చూస్తే 100 గ్రాముల తాటి ముంజలో సుమారుగా 40 కేలరీలు, 10 గ్రాముల పిండిపదార్థం, 85-90 శాతం నీరు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం, పీచుపదార్థం తక్కువగా ఉంటాయి.
ఈ తాటి ముంజల గురించి చాలా మంది మనసుల్లో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నిపుణులు వాటి గురించి సమాధానాలు చెప్పారు.
తాటి ముంజల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందని, శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుందని సాధారణంగా నమ్ముతారు. ఇందులో 85-90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు దారితీయడం సమస్య నుంచి ఇది కాపాడుతుంది.
మధుమేహం ఉన్నవారు తాటి ముంజలు తినవచ్చా?
మనం నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే, వడదెబ్బకు సంబంధించిన సమస్యలు అంత తక్కువగా ఉంటాయి. తాటి ముంజలో నీరు అధికంగా ఉంటుంది.. కాబట్టి దానిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది నేరుగా శరీర వేడిని తగ్గించకపోయినా, వడదెబ్బ లక్షణాలను తగ్గించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. దీనితో జలుబు లాంటి సమస్యలు రావు.
100 గ్రాముల తాటి ముంజల్లో 10 గ్రాముల పిండిపదార్థం ఉంటుంది. మీరు మూడు పూర్తి తాటి ముంజలు తిన్నా కూడా.. కేవలం 30-40 గ్రాముల పిండిపదార్థం మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిజానికి మనం సాధారణంగా తినే అన్నం, ఇడ్లీ, దోసె, పండ్లతో పోలిస్తే ఇది తక్కువ పిండిపదార్థం.
ఆ విధంగా చూస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒకటి రెండు తాటి కాయలు తినవచ్చు. కిలోల కొద్దీ తినడం వల్ల చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
బరువు తగ్గాలనుకునేవారు దీనిని మితంగా తినవచ్చు. ఇది తక్కువ కేలరీలు, మితమైన కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార పదార్థం కాబట్టి, 4-5 ముక్కలను మితంగా తినవచ్చు. దీనివల్ల కేలరీలు, కార్బోహైడ్రేట్లు పెరగకపోవడమే కాకుండా, శరీరంలో నీటి శాతం పెరిగి కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం.
బరువు తగ్గడానికి తాటి ముంజలు ఎలా ఉపయోగపడతాయి?
ఏ పండు పోషకాలు దానికదే ఉంటాయి. దేని ప్రత్యేక దానిదే. ఉదాహరణకు దీనిలో జామకాయలో ఉన్నట్లుగా విటమిన్ సి గానీ, అరటిపండులో ఉన్నట్లుగా పొటాషియం గానీ ఉండదు. అందుకే దీనిని ఇతర పండ్లతో పోల్చలేము. కానీ ఇది అద్భుతంగా రుచికరమైన పండు. ఇందులో నీళ్ల శాతం ఎక్కువగా ఉండి, కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. వేసవికి ఇది చాలా అనువైనది.
వేసవి లో మీకు వచ్చే మొటిమలు, చెమట మరకలపై తాటి ముంజతో రాసుకోవచ్చు. దీనివల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి వాపు నిరోధక గుణాలు లేనప్పటికీ, చర్మానికి తేమను అందించే గుణాలు ఉన్నాయి. ఇవి వేసవిలో చర్మం అధికంగా పొడిబారకుండా, పగుళ్లు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
తాటి ముంజలు వేసవిలో ఒక అద్భుతమైన ఆహారం. వీటిని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పోషకాలు, రుచి కలగలసిన ఈ పండును ఆస్వాదించండి.


