
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటున్నాయి. శివుడు, అసురుడి మధ్య యుద్ధ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Key Points
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'శంబాల' ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆది సాయి కుమార్ నటించిన ఈ చిత్రం మిస్టికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది.
ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.
'శంబాల' సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ విడుదల చేసిన ‘శంబాల’ ట్రైలర్
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’. ‘ఎ మిస్టికల్ వరల్డ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే ప్రేక్షకుల్లో మరంత హైప్ పెంచేస్తూ.. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’ అనే డైలాగ్స్, విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఆది సాయి కుమార్ యాక్షన్, అప్పియరెన్స్ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక మూవీని భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే.
వణుకు పుట్టిస్తున్న విజువల్స్, కథా నేపథ్యం
ఆది సాయి కుమార్ చిత్రం, విడుదల తేదీ వివరాలు
ప్రభాస్ రిలీజ్ చేసిన ‘శంబాల’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. వణుకు పుట్టిస్తున్న విజువల్స్‌తో, బలమైన కథాంశంతో వస్తున్న ఈ థ్రిల్లర్ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులను అలరించడం ఖాయం.


