|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Paradha Movie: రివ్యూస్‌ బాగుంటేనే సినిమా చూడండి: పరదా డైరెక్టర్

Published: 10-08-2025, 6:49 AM
Paradha Movie: రివ్యూస్‌ బాగుంటేనే సినిమా చూడండి: పరదా డైరెక్టర్

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

అనుపమ పరమేశ్వరన్ నటించిన 'పరదా' సినిమా ట్రైలర్ విడుదల

2

దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల రివ్యూలు బాగుంటేనే చూడమని సూచన

4

'పరదా' సినిమాకు పేరుతో పాటు డబ్బులు రావాలని దర్శకుడి ఆశ

‘పరదా’ సినిమా ట్రైలర్ విడుదల

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘ పరదా ‘. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు . ఈ మూవీని విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మించారు . తాజాగా హైదరాబాద్ ‌ లో ఈ మూవీ ట్రైలర్ ‌ ను మేకర్స్ విడుదల చేశారు . ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఈవెంట్ ‌ కు హాజరైన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఆసక్తికర కామెంట్స్ చేశారు . సినిమా రివ్యూలు నచ్చితేనే మూవీ చూడాలని అన్నారు .

ప్రవీణ్ మాట్లాడుతూ .. ‘ నా రెండు సినిమాలు శుభం , సినిమా బండి ఒక జోనర్ ‌ చిత్రాలు . కానీ ఈ సినిమా నాకు పర్సనల్ ‌ గా బిగ్ ‌ స్కేల్ ఫిల్మ్ . అందరు అనుకునేవాళ్లు వీడు చిన్న సినిమాలు చేస్తు ఉంటాడని . ముగ్గురు స్టార్స్ ‌ పక్కా కమర్షియల్ సినిమా తీశా . ఈ చిత్రానికి పేరు తప్పకుండా వస్తుంది . కానీ పేరుతో పాటు డబ్బులు రావాలి . ఇలా జరిగితే ఇలాంటి కంటెంట్ ‌ సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు . అనుపమకు ఇదొక పెద్ద సోలో ఫిల్మ్ . అనుష్కకు అరుంధతిలాగే అనుపమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి . ఇది తనకు చాలా ఫేవరేట్ ‌ మూవీ . థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి . పరదా రివ్యూలు బాగుంటేనే మా చిత్రాన్ని చూడండి . ఇది నా ఛాలెంజ్ ‘ మాట్లాడారు .

దర్శకుని ఆసక్తికర వ్యాఖ్యలు

అనుపమ పరమేశ్వరన్ పాత్ర ప్రాముఖ్యత

చివరగా, దర్శకుడు ప్రేక్షకులకు సినిమా రివ్యూలను బట్టి చూడాలని సూచించారు. ‘పరదా’ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆశ పడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.