
📌 Key Points
- పరాశక్తి సినిమాలో శివ కార్తికేయన్ నటనకు ప్రశంసలు.
- కమల్ హాసన్ 5 నిమిషాలు సినిమా గురించి మాట్లాడారు.
- రజినీకాంత్ ఫోన్ చేసి సినిమా బాగుందని మెచ్చుకున్నారు.
- సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కమల్ హాసన్ మరియు రజినీకాంత్ ప్రశంసించారు. వారి ప్రశంసల పట్ల శివ కార్తికేయన్ సంతోషం వ్యక్తం చేశారు.
కమల్ హాసన్ ప్రశంసలు
Parasakthi Film: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు శివ కార్తికేయన్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు కోలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే నటుడిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన శివకార్తికేయన్ తాజాగా పరాశక్తి(Parasakthi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రముఖ లేడీ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో హిందీ ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అవంతరాలను దాటుకుంటూ ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కాగా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు శివ కార్తికేయన్ పరాశక్తి సినిమా గురించి కోలీవుడ్ స్టార్ హీరోలైన కమల్ హాసన్(Kamal Hassan), రజినీకాంత్(Rajinikanth) ఈ సినిమా విషయంలో తనపై ప్రశంసలు కురిపించినట్లు శివ కార్తికేయన్ తెలియజేశారు.
రజినీకాంత్ రివ్యూ
ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ ప్రముఖ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ గారు పరాశక్తి సినిమా చూసిన తర్వాత దాదాపు 5 నిమిషాల పాటు తనతో మాట్లాడుతూ సినిమా గురించి ప్రశంసలు కురిపించారని తెలియజేశారు. తాను నటించిన అమరన్ సినిమా విడుదలైన సమయంలో కమల్ హాసన్ గారు రెండు నుంచి మూడు నిమిషాలు మాట్లాడారు కానీ ఇప్పుడు ఏకంగా 5 నిమిషాలు మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిన్న ఉదయం ఫోన్ చేసి మరి సినిమా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా సూపర్ గా ఉంది అంటూ ప్రశంశించారని శివ కార్తికేయన్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా కోలీవుడ్ ఇద్దరు లెజెండరీ హీరోల నుంచి తన సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించినట్టు శివ కార్తికేయన్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ జోడిగా శ్రీ లీల నటించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కు విలన్ పాత్రలో మరొక నటుడు జయం రవి నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా మంచి ఫలితాలను అందుకుంది. అయితే ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా తెలుగులో ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మరికొంత ఆలస్యంగా తెలుగులో విడుదల కాబోతుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివ కార్తికేయన్ మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.
శివ కార్తికేయన్ స్పందన
పరాశక్తి సినిమాకు కమల్, రజినీ వంటి స్టార్ హీరోల నుండి ప్రశంసలు లభించడం శివ కార్తికేయన్ కెరీర్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ సినిమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


