|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీతతో విడాకులపై పార్థిబన్ సంచలన వ్యాఖ్యలు! ఆ జీవితం కోసమే ఎదురుచూశానంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 12-02-2026, 12:35 AM
సీతతో విడాకులపై పార్థిబన్ సంచలన వ్యాఖ్యలు! ఆ జీవితం కోసమే ఎదురుచూశానంటూ షాకింగ్ కామెంట్స్!
  • నటి సీతతో 1990లో పార్థిబన్ వివాహం, 2001లో విడాకులు.
  • విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నానని పార్థిబన్ వెల్లడి.
  • భాగ్యరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‍గా పార్థిబన్ కెరీర్ ప్రారంభం.
  • 1989లో ‘పుదియ పాదై’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం, జాతీయ అవార్డు గెలుపు.

ప్రముఖ నటుడు, దర్శకుడు పార్థిబన్ తన భార్య సీతతో విడాకుల గురించి మాట్లాడారు. విడాకుల తర్వాత తాను సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పారు. వారి వైవాహిక జీవితం మరియు పార్థిబన్ సినీ ప్రస్థానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

సీతతో పార్థిబన్ వివాహం, విడాకులు

Parthiban:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య బంధం ఎంత కాలం కొనసాగుతుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితిగానే మారిపోయింది. ముఖ్యంగా పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటే.. ఇంకొంతమంది వృద్ధాప్యంలో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీనికి తోడు విడాకుల తర్వాత వారు చేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విలన్ విడాకులపై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఆయన ఎవరో కాదు ఆర్.పార్థిబన్. కోలీవుడ్ డైరెక్టర్ గా, నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని దాదాపు 12 ఏళ్ల తర్వాత తన భార్య నుంచి విడిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఏడడుగులు వేసిన ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ.. “12 ఏళ్ల తర్వాత నా వైవాహిక బంధంలో ఇబ్బందులు ఏర్పడడంతోనే నా భార్యకు విడాకులు ఇచ్చాను. అయితే ఆమె నుంచి విడిపోయినందుకు నేనెప్పుడూ బాధపడలేదు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకులు తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను.

ఈ 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈరోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. పైగా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోవడం లేదు. అందుకే విడాకుల తర్వాత ఈ జీవితం మరింత సంతోషంగా ఉంది” అంటూ పార్దిబన్ చెప్పుకొచ్చారు.

విడాకులపై పార్థిబన్ సంచలన వ్యాఖ్యలు

వీరి వైవాహిక బంధం విషయానికొస్తే.. 1990లో ప్రముఖ నటి సీతతో పార్థిబన్ అడుగులు వేశారు.వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పార్థిబన్ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. అటు సీతా మాత్రం మరొకరిని పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత అతడికి కూడా ఆమె విడాకులు ఇచ్చింది.

పార్దిబన్ తమిళ సినిమా నిర్మాత కూడా.. దర్శకుడు, రచయిత, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా వద్ద 1980లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా , దర్శకుడిగా కూడా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. 1989లో వచ్చిన ‘పుదియ పాదై’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాకి తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో కూడా అవార్డు లభించింది. 1989లో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టినా.. 1981 లోనే ‘రాణువ వీరన్’ అనే చిత్రంలో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

సినీ కెరీర్ ఆరంభం, అవార్డులు

అటు పదుల సంఖ్యలో సినిమాలను కూడా నిర్మించారు పార్దిబన్. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేను రౌడీనే, పొన్నియిన్ సెల్వన్ 1,2 వంటి చిత్రాలలో నటుడిగా నటించారు.

పార్థిబన్ విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.