|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాంకింగ్: ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ సినిమాల టికెట్లపై పవన్ సంచలన కామెంట్స్! దేహీ అంటే కుదరదు!

Published: 15-03-2026, 3:05 PM
షాంకింగ్: ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ సినిమాల టికెట్లపై పవన్ సంచలన కామెంట్స్! దేహీ అంటే కుదరదు!
  • ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది!
  • పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం కావడానికి రాజకీయాలే కారణం అని స్పష్టీకరణ!
  • శ్రీలీల నటన ఈ చిత్రంలో హైలైట్ అవుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడి!
  • టికెట్ రేట్ల కోసం తనను అడగవద్దని నిర్మాతలకు పవన్ సూచన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. దీనితో చిత్ర యూనిట్ ఆదివారం రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మొత్తం తరలి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల, రాశి ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో మెప్పించారు.

ఉస్తాద్ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కొన్ని ఆసక్తికర అంశాలని లేవనెత్తారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యలు నిర్వహిస్తుండడం వల్ల సినిమాలు చేసేందుకు ఎదురవుతున్న ఛాలెంజెస్ ని బయటపెట్టారు. పవన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. అలాంటి తెలుగు సినిమా చరిత్రలో తాను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉంది అని పవన్ అన్నారు. నాకు తెలిసిన హీరో అంటే అన్నయ్య చిరంజీవి గారే.

టికెట్ల రేట్లపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్!

ఈ ఈవెంట్ కి చిరంజీవి గారిని పిలుద్దాం అని హరీష్ శంకర్ అన్నారు. మీకు హీరో కావాలి అంటే అన్నయ్యని పిలవొద్దు. చిరంజీవి గారి తమ్ముడు కావాలి అంటే అన్నయ్యని పిలవండి అని చెప్పినట్లు పవన్ అన్నారు. అన్నయ్య పక్కన ఉంటే తాను హీరో అనే విషయాన్ని కూడా మరచిపోతాను అని తెలిపారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. కథ మారింది . కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాలకు సమయం కేటాయించడం వల్ల చాలా తక్కువ డేట్లు ఈ సినిమాకు ఇచ్చాను. హరీష్ శంకర్, మైత్రి మూవీస్ వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసి నా టైం వేస్ట్ కాకుండా చూశారు.

ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ చేయకపోవడానికి కారణం ఉంది. ఆమె పాత్ర ఈ చిత్రంలో చాలా బలంగా ఉంటుంది. శ్రీలీల అద్భుతమైన నటనని ఈ సినిమాలో చూస్తారు. ఇక రాశి ఖన్నా అయితే ఈ సినిమాలో ఎలాగైనా నటించాలి అని కథ వినకుండా అంగీకరించారు. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ చేయించాడు. హరీష్ లాంటి దర్శకుడు ఉంటే మన బౌండరీస్ ని పుష్ చేసుకోవచ్చు. రాజకీయాల్లో సమయం లేకపోవడం వల్ల కొన్ని సార్లు సినిమాలు ఆపేద్దాం అని అనిపిస్తుంది.

సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఇదే: పవన్

కానీ అందరి రాజకీయ నాయకుల్లా నాకు వ్యాపారాలు లేవు. నా టైం వృధా కాకుండా ఎవరైనా సినిమా ప్లాన్ చేస్తే చేస్తాను. నాతో సినిమా చేయాలి ఎవరైనా దర్శక నిర్మాతలు వస్తే.. హరీష్, మైత్రి మూవీస్ లాగా ప్లాన్ చేయండి అని చెబుతా. మనం ప్రభుత్వం లో ఉన్నాం కాబట్టి నా దగ్గరకు టికెట్ రేట్లు పెంచమని అడగడానికి నిర్మాతలు వస్తుంటారు. వాళ్లకు నేను ఒక్కటే చెప్పా. మీరు ఎంత కష్టపడి సినిమా చేస్తారో నాకు తెలుసు. మీరు దేహీ అని అడుక్కోవద్దు. సినిమా టికెట్ ధరలు పెంచితే అందులో 18 శాతం జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికే వెళుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు, ఎన్టీఆర్ సినిమాకు, ప్రభాస్ గారి సినిమాకు టికెట్ ధరలు పెంచాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే విధంగా కాంతారా సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచినట్లు పవన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.