
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లోని ప్రధాని మోడీ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా జులై 24న విడుదల కానుంది.
Key Points
హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలైంది.
పవన్ కల్యాణ్ ప్రధాని మోడీ డైలాగ్ 'ఆంది ఆగయా' సినిమాలో ఉంది.
సోషల్ మీడియాలో ట్రైలర్‌కు భారీ స్పందన.
హరిహర వీరమల్లు ట్రైలర్ హైలైట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie) ట్రైలర్ వచ్చేసింది. అనుకున్న సమయానికి సరిగ్గా 11:10 నిమిషాలకు విడుదల చేశారు. హిందువులపై ఔరంగజేబు చేస్తున్న దాడిని వివరిస్తూ ప్రారంభమైన ట్రైవర్.. వారిని కాపాడే వీరుడి ఎంట్రీతో మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేగాకుండా.. విలన్‌తో ఫైట్ సీన్‌లో ఆంది ఆగయా అనే డైలాగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోడీ(PM Modi) ‘పవన్ నహీ.. ఆందీ హై’ అని మాట్లాడిన విషయం తెలిసిందే. అదే డైలాగ్‌ను సినిమాలో వాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్‌ఫుల్ వీరమల్లుగా యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్ ఆకట్టుకుంటున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కనిపించనున్నారు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ను అందరినీ ఆకట్టుకుటుందని మేకర్స్ ప్రకటించారు.
వీరమల్లు’ విధ్వంసం.. అదిరిపోయిన ట్రైలర్.. కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్
ప్రధాని మోడీ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణ
సినిమా విడుదల తేదీ
మొత్తంమీద, హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ నటన, ప్రధాని మోడీ డైలాగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు. జులై 24 వరకు వేచి చూడాలి.


