|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ! హరీష్ శంకర్ సంచలన నిజాలు!!

Published: 04-03-2026, 11:35 PM
షాకింగ్: పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ! హరీష్ శంకర్ సంచలన నిజాలు!!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్!
  • మిరపకాయ్ కథను మొదట పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన హరీష్ శంకర్.
  • పవన్ కళ్యాణ్ మిరపకాయ్ వదులుకొని తీన్మార్ సినిమా చేయడం జరిగింది.
  • మిరపకాయ్ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన సినిమా మిస్ అయిందని తెలిసింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే…

పవన్ కళ్యాణ్ వదులుకున్న మిరపకాయ్..!

Pawan Kalyan  : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రానుంది. ఈ సినిమా మార్చ్ 26 రిలీజ్ కానుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చాలా సూపర్ హిట్ సినిమా కథలను వదులుకున్న సంగతి తెలిసిందే. ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, పోకిరి.. ఇలా చాలా సూపర్ హిట్ సినిమాలను వద్దనుకున్నారు పవన్. పవన్ వదిలేసిన సినిమాలను రవితేజ అందుకొని స్టార్ హీరో అయ్యాడని కూడా అంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వదిలేసిన మరో సినిమా గురించి తెలిపాడు.

హరీష్ శంకర్ చెప్పిన షాకింగ్ నిజాలు

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను మిరపకాయ్ కథని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికే చెప్పాను. ఆయన ఓకే అన్నారు. మూడు నెలలు ట్రావెల్ చేసారు ఆ కథతో. కానీ ఎందుకో తర్వాత వద్దన్నారు. మిరపకాయ్ వదిలేసి ఆయన తీన్మార్ సినిమా చేశారు. దాంతో నేను రవితేజతో మిరపకాయ్ సినిమా చేశాను అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఫాన్స్ నిరాశ..!

మిరపకాయ్ సినిమా 2011లో సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ కొట్టింది. తీన్మార్ సినిమా అదే 2011 లో సమ్మర్ కి వచ్చి యావరేజ్ గా నిలిచింది. ఆ వెంటనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి 2012 లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ మిరపకాయ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేసుంటే బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద హిట్స్ పవన్ ఖాతాలో పడేవి అని అనుకుంటున్నారు. అప్పుడు కూడా పవన్ వద్దనుకున్న సినిమా రవితేజ వద్దకు వెళ్లి హిట్ కొట్టడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న సినిమాల గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.