|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘OG2’: సుజీత్ సంచలనం! టైటిల్ లీక్.. అభిమానులకు పండగే!

Published: 14-04-2026, 7:35 AM
పవన్ కళ్యాణ్ 'OG2': సుజీత్ సంచలనం! టైటిల్ లీక్.. అభిమానులకు పండగే!
  • పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో OG సినిమాకు సీక్వెల్ రాబోతుంది.
  • OG2 సీక్వెల్ కోసం ‘ఓజస్ గంభీర – ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్ పరిశీలనలో ఉంది.
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
  • పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన OG సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా OG2 రాబోతుంది. దీనికి ‘ఓజస్ గంభీర – ర్యాంపేజ్ బిగిన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

OG2 టైటిల్ ఏమిటి?

OG 2Title: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం OG. ఈ సినిమా గత ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి మంచి సక్సెస్ అందుకుంది .ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకు తప్పనిసరిగా సీక్వెల్ సినిమా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించారు. ఈ సీక్వెల్ పనులు ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్(Sujeeth) నానితో బ్లడీ రొమియో(Bloody Romeo) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ OG 2 పనులు ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని సమాచారం. ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండో భాగంలో పవన్ కళ్యాణ్ స్టైల్ ,మేనరిజం, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీ సమాచారం. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సినిమా నిర్మాణ వివరాలు

ఈ సినిమా కోసం సుజీత్ OG 2 అని కాకుండా ఒక పవర్ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ఓజస్ గంభీర – ర్యాంపేజ్ బిగిన్స్’ (Ojas Gambheera Rampage Begins)అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. టైటిల్ తోనే సినిమాపై సుజిత్ అంచనాలను, ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన డేట్స్ బట్టి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్..

పవన్ కళ్యాణ్ రాజకీయాలు మరియు సినిమా

ఇక OG సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సీక్వెల్ సినిమాలో హీరోయిన్గా ఆమె నటించబోతున్నారా ?లేదంటే కొత్త వారు రంగంలోకి రాబోతున్నారా ?అనేది తెలియాల్సింది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. సుజిత్ ప్రస్తుతం నాని సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులతో పాటు మరోవైపు పవన్ డేట్స్ అనుగుణంగా OG 2 షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని ఇండస్ట్రీస్ సమాచారం.

OG2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.