|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ మూవీలో అఖిల్ హీరోయిన్ ఫిక్స్! సురేందర్ రెడ్డి సంచలన నిర్ణయం!

Published: 17-02-2026, 1:35 PM
పవన్ కళ్యాణ్ మూవీలో అఖిల్ హీరోయిన్ ఫిక్స్! సురేందర్ రెడ్డి సంచలన నిర్ణయం!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు.
  • ఈ సినిమాలో అక్కినేని హీరోయిన్ సాక్షి వైద్య నటించనున్నారు.
  • 2026 జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
  • ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తర్వాత ఈ సినిమా పనులు మొదలవుతాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ 2026 జూన్ నుండి ప్రారంభమవుతుంది.

సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం తన వృత్తిపరమైన విషయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మార్చ్ 26 తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar Reddy) డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి అద్భుతమైన కథను నేరేట్ చేయటంతో పవన్ కళ్యాణ్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా ఎంపిక అయ్యారని తెలుస్తోంది.

హీరోయిన్ గా సాక్షి వైద్య ఎంపిక

ఇలా సాక్షి వైద్య పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి వైద్య ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా పవన్ సినిమాకు ఈమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల..

షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని ఇండస్ట్రీ సమాచారం. ఇక ఈ సినిమాని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు అధికారకంగా వెల్లడి కానున్నాయి.

పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాక్షి వైద్య హీరోయిన్ గా ఎంపిక కావడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.