
📌 Key Points
- పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ: పూజా కార్యక్రమాలు లేకుండానే డైరెక్ట్ షూటింగ్ ప్రారంభం!
- వక్కంతం వంశీ అందించిన కథతో పవన్ కళ్యాణ్ సరికొత్త మాస్ అవతార్‌లో మెరవనున్నారు.
- ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం.. పవన్ కళ్యాణ్ కేవలం రెండు నెలలు మాత్రమే కేటాయించారట!
- రామ్ తాళ్లూరి నిర్మాణంలో భారీగా రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదిగోండి అదిరిపోయే న్యూస్! సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను ప్రారంభించనున్నారు.
డైరెక్ట్ సెట్స్ కే: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!
Pawan Kalyan: ఓజీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గ్యాంగ్ స్టార్ కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించి హైప్ క్రియేట్ చేశాడు సుజిత్.
ఇక ఓజీ తరువాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన చాలా కాలం క్రితమే వచ్చినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. రీసెంట్ గా ఈ భారీ ప్రాజెక్టు నుంచి అప్డేట్ వచ్చింది.
వక్కంతం వంశీ కథతో పవన్ కళ్యాణ్ మాస్ ట్రీట్!
దీంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. ఇప్పటికే కథను కూడా ఫినిష్ చేశాడట వక్కంతం వంశీ. ఈ నేపధ్యంలోనే రీసెంట్ గా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిశారట దర్శకుడు సురేందర్ రెడ్డి అండ్ వక్కంతం వంశీ. ఈ సినిమా గురించి ఫైనల్ న్యారేషన్ కూడా ఇచ్చారట. దానికి పవన్ కళ్యాణ్ చాలా ఇంప్రెస్ అయ్యాడని టాక్.
షూటింగ్ షురూ.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఫిక్స్!
డేట్స్ కూడా అలాట్ చేశాడట. అయితే, ఈ ప్రాజెక్టు పూజ కార్యక్రమాలు లాంటివి లేకుండానే డైరెక్ట్ మొదలవనుందట. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుందని సమాచారం. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం మే నుంచి ఈ సినిమా షూటింగ్ లో ప్దాల్గొననున్నాడు. అది కూడా కేవలం రెండు నెలల సమయాన్ని మాత్రమే ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అందుకోసమే డెడ్ లైన్ పెట్టుకొని మరీ పని చేయనున్నారట టీం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


