|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా! దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్!

Published: 06-04-2026, 12:35 AM
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ విడుదల వాయిదా! దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల వాయిదా, జూన్ 26కు విడుదల కానుంది.
  • నైజాం హక్కుల విషయంలో దిల్ రాజుకు మైత్రి మూవీ మేకర్స్ షాక్ ఇచ్చింది.
  • సినిమాలో ఇంకా ఒక పాట చిత్రీకరణ, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • ఏ ఆర్ రెహమాన్ బిజిఎం కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. అంతేకాకుండా, నైజాం హక్కుల విషయంలో దిల్ రాజుకు మైత్రి మూవీ మేకర్స్ షాక్ ఇచ్చింది. ఈ పరిణామాల వెనుక అసలు కారణాలేంటో తెలుసుకుందాం.

పెద్ది మూవీ విడుదల వాయిదాకు కారణాలు

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే డైరెక్టర్గా తనను తాను నిరూపించుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Bucchibabu Sana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 27 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఈ సినిమా ప్రారంభం రోజే తెలిపారు. కానీ వీఎఫ్ఎక్స్ పెండింగ్, మిగతా సినిమా షూటింగ్ పెండింగ్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అదే సమయంలో తెలంగాణలో తీసుకొచ్చిన 90 రోజుల టికెట్ నిబంధనలను చూపించి ఏప్రిల్ 30వ తేదీకి సినిమాను వాయిదా వేశారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . కానీ ఈ చిత్ర హీరో రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా విడుదల వాయిదా కాలేదు.. ఏప్రిల్ 30వ తేదీన కచ్చితంగా వస్తుంది అని స్పష్టం చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంకా ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉండడం, మరొకవైపు సినిమా విఎఫ్ఎక్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని అటు టెక్నీషియన్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అద్భుతమైన బిజిఎంను అందించడానికి కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాను ఇప్పుడు జూన్ 26వ తేదీకి వాయిదా వేసి , జూన్ 25వ తేదీన ప్రీమియర్ షో వేయాలి అని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది.

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నైజాం హక్కులను ఎవరికి ఇవ్వబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చి సొంతంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అసలు విషయంలోకి వెళ్తే .. నైజాం ఏరియా అనగానే దిల్ రాజు పేరు గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి పెద్ద సినిమా లేదా చిన్న సినిమా వచ్చినా దాదాపు అక్కడి థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకుంటారనే వార్తలు రాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మైత్రి మూవీ మేకర్ సంస్థ సొంతంగా విడుదల చేయడానికి సిద్ధమవుతుందని వార్త ఇప్పుడు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

నైజాం హక్కులపై సంచలన నిర్ణయం!

ఇకపోతే సాధారణంగా భారీ చిత్రాలకు ఇతర డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తాయి. అందుకే దిల్ రాజు పేరు కూడా గట్టిగా వినిపించింది. కానీ సినిమా అవుట్ పుట్ పై ఉన్న నమ్మకంతో మైత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ హక్కుల విలువ సుమారుగా 63 కోట్లని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుకు అనుమతి రాకపోతే మాత్రం ఇంత భారీ మొత్తాన్ని అక్కడ రికవరీ చేయడం సినిమాకి అతిపెద్ద సవాల్ గా మారే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కానీ రామ్ చరణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇది సాధ్యమేనని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ , పాటలు సోషల్ మీడియాలో మంచి రికార్డులు సృష్టిస్తున్నాయి. పైగా రామ్ చరణ్ కెరియర్ లో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో చేస్తున్నారు. పైగా ఆస్కార్ విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ..బోమన్ ఇరానీ, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ , జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

చివరిగా, ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడటం, నైజాం హక్కుల విషయంలో తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.