|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ వచ్చేసింది! ఫాన్స్ కి పండగే పండుగ!

Published: 26-02-2026, 7:35 AM
రామ్ చరణ్ 'పెద్ది' సెకండ్ సింగిల్ వచ్చేసింది! ఫాన్స్ కి పండగే పండుగ!
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
  • మార్చి 2న ‘రాయ్ రాయ్ రా రా’ అనే సెకండ్ సింగిల్ విడుదల కానుంది, ఇది రామ్ చరణ్ ఇంట్రో సాంగ్.
  • మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ 200 మిలియన్ వ్యూస్‌తో భారీ విజయాన్ని అందుకుంది.
  • చిత్ర బృందం విడుదల తేదీ వాయిదా వార్తలకు చెక్ పెట్టింది, సినిమా ఏప్రిల్ 30నే విడుదలవుతుంది.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘రాయ్ రాయ్ రా రా’ మార్చి 2న విడుదల కానుంది. ఈ పాట రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ అని సమాచారం. సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.

సెకండ్ సింగిల్ విడుదల తేదీ ప్రకటన

Peddi Second Single: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం తెలియచేశారు అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల కాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమా నుంచి రాయ్ రాయ్ రా రా (Rai Rai Raa Raa) అంటూ సాగిపోయే పాటను మార్చి రెండో తేదీ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచస్తున్నారు.

ఇక ఈ పాట రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ అని తెలుస్తోంది. ఏకంగా 100 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పటికే పెద్ద సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాటకు విపరీతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 మిలియన్ పైగా వ్యూస్ కైవసం చేసుకుని సంచలనాలను సృష్టించడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఇలా పస్ట్ సింగల్ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

‘రాయ్ రాయ్ రా రా’ పాట విశేషాలు

This song fuels the fire within 🔥🔥 #Peddi second single #RaiRaiRaaRaa will be a blast 💥💥

Full Song on 2nd March. #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani … pic.twitter.com/dXANh0eXjQ

— Ram Charan (@AlwaysRamCharan) February 26, 2026

ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కి సంబంధించి అప్డేట్ తెలియచేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలకు కూడా ఈ సందర్భంగా చిత్ర బృందం చెక్ పెట్టారు. చిత్ర బృందం ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 30 తేదీ విడుదల కాబోతుందని తెలియజేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ విభిన్నమైన లుక్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈసారి రామ్ చరణ్ కచ్చితంగా సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు వృద్ధిస్ సినిమా బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా విడుదల కానుండగా, మార్చి 2న సెకండ్ సింగిల్ విడుదల కానుంది. మొదటి పాట విజయం సాధించడంతో, రెండవ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.