|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూనమ్ కౌర్ vs పవన్ కళ్యాణ్: ‘ఫేక్ సింగ్’ కామెంట్స్ కలకలం! టార్గెట్ ఫిక్స్?

Published: 23-03-2026, 8:35 AM
పూనమ్ కౌర్ vs పవన్ కళ్యాణ్: 'ఫేక్ సింగ్' కామెంట్స్ కలకలం! టార్గెట్ ఫిక్స్?
  • పూనమ్ కౌర్ సిక్కు గెటప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌ను ‘ఫేక్ సింగ్’ అని విమర్శించారు.
  • రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమాలోని సిక్కు పాత్రను పూనమ్ ప్రశంసించారు.
  • పవన్ కళ్యాణ్ సిక్కు గెటప్ కేవలం సినిమా పబ్లిసిటీ కోసమేనని పూనమ్ అభిప్రాయం.
  • పూనమ్, పవన్ కళ్యాణ్ మధ్య గతంలో ఉన్న విభేదాలే ఈ వివాదానికి కారణమని అభిమానుల ఆరోపణ.

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ సిక్కు గెటప్‌ను టార్గెట్ చేస్తూ ఆయనను ‘ఫేక్ సింగ్’ అని ఆమె విమర్శించారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు

Poonam Controversy : టాలీవుడ్ ‘కాంట్రవర్సీ క్వీన్’ పూనమ్ కౌర్ మళ్ళీ బాంబు పేల్చింది! తన ఇన్‌స్టా స్టోరీస్‌తో ఎప్పుడూ హడావిడి చేసే పూనమ్, ఈసారి ఏకంగా ‘సిక్కు’ గెటప్ రాజకీయాన్ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఏకిపారేసిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది .

బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ రికార్డులు కొల్లగొడుతుంటే, పూనమ్ మాత్రం ఆ సినిమాలో రణ్‌వీర్ పోషించిన జస్క్రిత్ సింగ్ రంగీ పాత్రను ఆకాశానికెత్తేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పదునైన బాణం వదిలింది. “ది రియల్ సింగ్.. స్టోరీ ఆఫ్ రియల్ హీరో. ధురంధర్ 2 సినిమా కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను” అని రాస్తూనే, చివర్లో “ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్సాఫీస్ ముందు నిలబడలేరు” అంటూ చేసిన కామెంట్స్   ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయ్.

‘రియల్ సింగ్’ అంటూ రణ్‌వీర్‌ను పొగడ్తలు

అయితే ఈ కామెంట్స్ నేరుగా పవన్ కళ్యాణ్‌కే గుచ్చుకున్నాయని  మండిపడుతున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే ఆ మధ్య పవన్ సిక్కు గెటప్ లో కనిపించడం పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది , ఇపుడు దురంధర్ 2 రిలీజ్ అయిన రోజే   ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి రావడంతో పూనం కావాలనే ఈ కామెంట్స్ వదిలిందన్నది వారి వాదన . పూనమ్ స్వతహాగా సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో, కేవలం సినిమా పబ్లిసిటీ కోసం పవన్ ఆ గెటప్ వేయడాన్ని ఆమె క్రింజ్ ’ (Cringe) గా ఫీలైందని, అందుకే ఆయనను ‘ఫేక్ సింగ్’ అంటూ ఓ రేంజ్‌లో తక్కువ చేసిందని  ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు.

గతంలో వీరిద్దరి మధ్య ఉన్న పాత పగలను మనసులో పెట్టుకుని, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే ఆమె అసలు టార్గెట్ అని, అందుకే ఇలాంటి ‘డబుల్ మీనింగ్’ పోస్ట్‌లతో రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు  పుట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూనమ్ దృష్టిలో రణ్‌వీర్ ‘రియల్’ అయితే, పవన్ ‘ఫేక్’ నా? అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మీద పూనమ్ కౌర్ కు ఉన్న కోల్డ్ వార్  ఏంటో అందరికీ తెలిసిందే అయినా, ఇలా ఒక సిక్కు క్యారెక్టర్ పేరుతో ఆయన్ని టార్గెట్ చేయడం మాత్రం ‘నెక్స్ట్ లెవల్’ షేడ్ అనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన పూనమ్?

ఈ వివాదంపై పూనమ్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఆమె వదిలిన కామెంట్స్  మాత్రం సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయ్ . పూనమ్ ఈ పోస్ట్‌తో పవన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేయాలని చూస్తోందా? లేక తన కమ్యూనిటీని గౌరవించని వారిని నిలదీస్తోందా? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సస్పెన్స్. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక పూనమ్ మరిన్ని ‘ఫ్యాక్ట్స్’ (Facts) తో పవన్ కళ్యాణ్ పరువు తీస్తుందా? అనేది వేచి చూడాలి!

read also : Rudraveena Controversy: వెంకటేష్ టైటిల్ పై కన్నేసిన మెగాస్టార్? ఆ శాపమే సినిమాను ముంచేసిందా?

మొత్తానికి పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.