
📌 Key Points
- పూనమ్ కౌర్ వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- వైసీపీ నేతలను విమర్శిస్తూ ఒక న్యూస్ ఛానల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.
- ఆ న్యూస్ ఛానల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నిరసనలు తెలిపారు.
- మహిళలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని పూనమ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
నటి పూనమ్ కౌర్ వైసీపీకి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆమె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ గతంలో కూడా పోస్ట్లు చేసిన విషయం తెలిసిందే.
వైసీపీకి మద్దతుగా పూనమ్ కౌర్ పోస్ట్
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఆమె ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో వీరిద్దరిని ఇన్ డైరెక్ట్ గా తిట్టిన పూనమ్.. ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ పేరును బహిరంగంగానే ప్రస్తావిస్తూ మండిపడుతోంది మరొకవైపు మొన్నటికీ ఉస్తాద్ భగత్ సింగ్ , ధురంధర్ 2 సినిమాల విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ నిన్ ఉద్దేశించి “ఫేక్ సింగ్ ఎక్కువ కాలం నిలవలేరు” అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.
అయితే ఇప్పుడు వైసీపీ కి మద్దతుగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ పార్టీని ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తోందా? అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. “మావిగన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకులను విమర్శించే క్రమంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.. దీంతో సదరు న్యూస్ ఛానల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసిపి శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటూ రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు కూడా చేపట్టారు.
ముఖ్యంగా సదరు న్యూస్ ఛానల్ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. “మావిగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి..”మీ భార్యలు భార్యలు కాదని చెబితే, గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి, పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెనుకాడని, వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారయ్యింది” అంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా వైసిపి నాయకుల భార్యలపై ఇలా మీడియా ఛానల్ చేసిన వ్యాఖ్యలను పూనమ్ తప్పుబడుతూ కౌంటర్ ఇచ్చారు. పైగా వైయస్ జగన్ ఫాలోవర్స్ కు మద్దతుగా ఆమె ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యూస్ ఛానల్
సదరు న్యూస్ ఛానల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూ..”మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు తీసుకున్నటువంటి చర్యలే ఇప్పుడు చాలా అవసరం. మహిళలను కించపరుస్తూ వారి బంధాలను అవమానించేలా పూర్తిగా స్త్రీ ద్వేషపూరితంగా మాట్లాడే ఎవరికైనా సరే ఖచ్చితంగా గుణపాఠమే చెప్పాలి. నేటి న్యూస్ చానల్స్ బ్లాక్ మెయిలింగ్ బాక్సుల తయారయ్యాయి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను.. కనీసం ఇప్పటికైనా వైసీపీ నేతలు రంగంలోకి దిగి ఇలాంటి వారి ఆటలు కట్టించాలి “అంటూ తనదైన శైలిలో ఆమె కామెంట్లు చేసింది. దీంతో ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ ఇన్ డైరెక్ట్ గా వారిని (పవన్ కళ్యాణ్ పార్టీ) ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందా అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి.
ఇక అలాగే మరో ట్వీట్ చేస్తూ..” ఈరోజు ఆ న్యూస్ ఛానల్ పై జరుగుతున్న తిరుగుబాటులను చూస్తుంటే.. అప్పట్లో నాపై అత్యంత దుర్మార్గంగా దాడి చేసి నా జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి.నేను నా నిశ్శబ్ద మార్గాలలో పోరాడినప్పటికీ ఎవరు కూడా తమ పశ్చాతాపాన్ని వ్యక్తం చేయలేదు కదా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్ కౌర్.. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్
Action taken by Jagan Mohan Reddy Garu’s followers for anti women remarks which are completely misogynistic, insulting women and their relationships is what is needed when any one does it – no matter who it is – I always said news channels today are blackmailing boxes. #ABN
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 7, 2026
మొత్తానికి పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది అనేది వేచి చూడాలి.


