|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కల్కి 2: ప్రభాస్ ఫైర్.. ఫిబ్రవరి నుండి షూటింగ్ షురూ! హీరోయిన్ ఎవరంటే..?

Published: 12-01-2026, 6:00 AM
కల్కి 2: ప్రభాస్ ఫైర్.. ఫిబ్రవరి నుండి షూటింగ్ షురూ! హీరోయిన్ ఎవరంటే..?
  • ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ సంక్రాంతికి విడుదలైంది, మిశ్రమ స్పందన పొందింది.
  • ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి, సందీప్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నారు.
  • ఫిబ్రవరి నుంచి ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
  • ‘కల్కి 2’ నుండి దీపికా పదుకొనే తప్పుకోవడంతో హీరోయిన్ వేట మొదలైంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన రాజాసాబ్ మూవీ సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఫిబ్రవరి నుండి కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

రాజాసాబ్ విడుదల, ప్రభాస్ తదుపరి సినిమాలు

Kalki Part 2 Update: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఇదివరకు ది రాజాసాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఇప్పటికే హను రాఘవపూడి ఫాజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 60% శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో నటిస్తున్న స్పిరిట్ సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా గత నెల రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇలా ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ప్రభాస్ మరో సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం

ఈ సీక్వెల్ సినిమా షూటింగ్ గురించి ఇదివరకు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ఫిబ్రవరి నుంచి కల్కి 2 షూటింగ్ పనులలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈలోపు హను రాఘవపూడి సినిమా షూటింగ్ పనులను పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి నుంచి కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం కానున్నాయి అంటూ ఈ సినిమా షూటింగ్ అప్డేట్ రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను అధికారకంగా వెల్లడించనున్నారు.

కల్కి 2 నుంచి తప్పుకున్న దీపికా పదుకొనే..

కల్కి 2 నుండి తప్పుకున్న దీపికా పదుకొనే

ఇక ఈ సినిమా పురాణాల ఆధారంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ , కమల్ హాసన్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఇక బాలీవుడ్ నటి దీపిక పదుకొనే (Deepika Padukone)హీరోయిన్ గా నటించారు. కానీ రెండో భాగం నుంచి ఈమెను తప్పించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే కల్కి 2 సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ అలాగే షూటింగ్ అప్డేట్ కి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి 2 షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ ఎంపికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.