|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే.. `రాజాసాబ్‌`, `ఫౌజీ`ల పరిస్థితేంటంటే?

Published: 27-07-2025, 5:41 AM
ప్రభాస్‌ కొత్త సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే.. `రాజాసాబ్‌`, `ఫౌజీ`ల పరిస్థితేంటంటే?

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలలో బిజీగా ఉన్నారు. ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలతో ఆయన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కథనం ద్వారా ఈ చిత్రాల తాజా అప్డేట్స్ తెలుసుకుందాం.

Key Points

1

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

2

ఆగస్టులో 'ఫౌజీ' చిత్ర షూటింగ్ ప్రారంభం.

4

ప్రభాస్ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు.

‘రాజాసాబ్’ చిత్రం విడుదల తేదీ

డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్‌ మూవీ కూడా దాదాపు మూడు నాలుగు వందలకోట్లు వసూలు చేస్తాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆయన చేతిలో ఐదారు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా అప్‌ డేట్‌ వచ్చింది. కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడో తెలిసిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్‌ `ది రాజాసాబ్‌` మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది ప్రభాస్‌ కెరీర్‌లోనే మొదటిసారిగా హర్రర్‌ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.

రొమాంటిక్‌ హర్రర్‌ ఫాంటసీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మారుతి. తన మార్క్ కామెడీ ఇందులో హైలైట్ గా ఉండబోతుందట.

సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, రొమాన్స్ పరంగా కొదవలేదని, ఇటీవల కాలంలో ప్రభాస్‌ నుంచి మిస్‌ అయిన రొమాన్స్ ఇందులో చూడొచ్చు అని మారుతి తెలిపారు.

‘ఫౌజీ’ చిత్రం గురించి అప్‌డేట్స్

డిసెంబర్‌ 5న మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, కొంత ప్యాచ్‌ వర్క్ మిగిలి ఉందని, అది కంప్లీట్‌ చేసే పనిలో ప్రభాస్‌ ఉన్నారట.

ఆగస్ట్ లో `ఫౌజీ` సెట్‌లోకి అడుగుపెడతాడట ప్రభాస్‌. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్ లేదు.

కొన్ని సినిమా థీమ్‌ని చెప్పే పోస్టర్లు వచ్చాయి, గానీ ప్రభాస్‌ లుక్‌గానీ, టైటిల్‌ గానీ రివీల్‌ చేయలేదు. పీరియాడికల్‌ వార్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీతో సాగుతుందని తెలుస్తుంది.

ఇందులో డార్లింగ్‌ సైనికుడిగా కనిపించబోతున్నారట. ఈ చిత్ర షూటింగ్‌ని ఆగస్ట్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. దీన్ని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు డార్లింగ్‌. నెక్ట్స్ ఆయన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ కొత్త సినిమా ‘స్పిరిట్’ ప్రారంభం

ఈ మూవీ షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చారు దర్శకుడు సందీప్‌. సెప్టెంబర్‌ ఎండింగ్‌లో మూవీని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఒక్క సారి షూటింగ్‌ స్టార్ట్ అయ్యిందంటే గ్యాప్‌లేకుండా సినిమా షూటింగ్‌ చేయాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నట్టు తెలిపారు సందీప్‌. విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన `కింగ్‌డమ్‌` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో సందీప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. డార్లింగ్‌ ఫ్యాన్స్ కి మంచి ఊపిచ్చే వార్తని వెల్లడించారు.

సందీప్‌ రెడ్డివంగాతో ప్రభాస్‌ చేయబోయే మూవీ మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో డార్లింగ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని, ఆయన పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్‌ కూడా ఉంటుందని సమాచారం.

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో `యానిమల్‌` ఫేమ్‌ డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఇక ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`, `ఫౌజీ`, `స్పిరిట్`లతోపాటు ప్రశాంత్‌ వర్మతో మూవీ, అలాగే `సలార్‌ 2`, `కల్కి 2` చేయాల్సి ఉంది.

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, అతని కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ కథనం ద్వారా తెలిసింది. ‘స్పిరిట్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.