
📌 Key Points
- ప్రభాస్ ప్రస్తుతం చేతిలో అరడజన్ కు పైగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
- దర్శకుడు సుజీత్ ‘సాహో’ తర్వాత అవకాశాలు తగ్గినా, పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో మంచి కంబ్యాక్ ఇచ్చారు.
- కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తమ బ్యానర్‌లో సుజీత్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోంది.
- ఈ ప్రాజెక్ట్‌కి హీరోగా మళ్లీ ప్రభాస్‌నే ఎంచుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్! ‘సాహో’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సుజీత్ కలిసి మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రానుందని వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ చేతిలో అరడజన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు
Prabhas Reunite With Sujeeth: ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది . బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ చేతిలో అరడజన్ పైగా చిత్రాలు పెట్టుకున్నారు . అందరు అగ్ర దర్శకులే .. అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెం 1 హీరోగా మారాడు . బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్నవి భారీ బడ్జెట్ సినిమాలు . ఒక మూవీ షూటింగ్ అయిపోయాగానే మరో కొత్త సినిమాను కమిట్ అవుతున్నారు . ప్రస్తుతం అతడి చేతిలో ది రాజా సాబ్ , ఫౌజీ , సలార్ 2, కల్కి 2898 ఏడీ 2, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి . మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి .
అందులో దర్శకుడు సుజీత్ తో ఓ ప్రాజెక్ట్ ఉన్నట్టు తెలుస్తోంది . ప్రస్తుతం వీరిద్దరి కాంబోపై చర్చలు జరుగుతున్నాయట . కాగా గతంలో ప్రభాస్ సుజీత్ తో సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే . ఈ చిత్రంతోనే సుజీత్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది . ప్రభాస్ తో చేసిన ఈ స్పై యాక్షన్ మూవీ ఇటూ బాలీవుడ్ , దక్షిణాది ఇండస్ట్రీలను షేక్ చేసింది . ఇందులో సుజీత్ విజన్ కి ప్రేక్షకులు , ఇండస్ట్రీలు వర్గాలు సైతం ఫిదా అయ్యాయి . అయితే తెలుగు , దక్షిణాది భాషల్లో సాహో ఆశించిన రెస్పాన్స్ రాలేదు .. కానీ , బాలీవుడ్ బాక్సాఫీసు మాత్రం ఈ మూవీ షేక్ చేసింది . అక్కడ ఈ మూవీ బ్లాక్ బస్టర్ .
సుజీత్ తో మళ్లీ ప్రభాస్.. సాహో మ్యాజిక్ రిపీట్?
ఈ సినిమా తర్వాత సుజీత్ కి పెద్దగా అవకాశాలు రాలేదు . రెండు మూడు సినిమాలు చేసిన అవి హిట్ కాలేదు . లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ ఓజీతో అతడు మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చాడు . దీంతో అగ్ర నిర్మాతలు సుజీత్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట . ఈ నేపథ్యంలో కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సుజీత్ ను తమ బ్యానర్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది . ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిలా సుజీత్ తో ప్లాన్ చేస్తున్నారట . దీని కోసం ఆయనతో కథ రెడీ చేయిస్తున్నారట . ఈ ప్రాజెక్ట్ కి హీరోగా ప్రభాస్ ని అనుకుంటున్నారట . ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనగానే మొదట గుర్తోచ్చే హీరో ప్రభాస్ . ఈ హీరో ప్రస్తుతం తను కమిటైన ఒక్కొ సినిమాను షూటింగ్స్ పూర్తి చేస్తూ వస్తున్నాడు .
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సుజీత్ కొత్త ప్రాజెక్ట్
ది రాజా సాబ్ పూర్తవగా .. ఫౌజీ తుది దశలో ఉంది . దీంతో ప్రభాస్ కాస్తా ఫ్రీ అయ్యాడు . ఇక సుజీత్ కథ రెడీ చేసి .. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసేలోపు స్పిరిట్ మూవీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది . సుజీత్ దర్శకుడిగా .. ప్రభాస్ హీరోగా హొంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతుందనే టాక్ ఇన్ సైడ్ సినీ సర్కిల్లో గట్టిగా వినిపిస్తుంది . దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే . ఇదిలా ఉంటే సలార్ హిట్ తర్వాత హొంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రభాస్ భారీ డిల్ చేసుకున్న సంగతి తెలిసిందే . తమ సంస్థ ప్రభాస్ మరో మూడు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు . దీనిలో భాగంగా ఇప్పుడు సుజీత్ తో ప్రభాస్ సినిమాను రెడీ చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు కన్నడ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ .
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రభాస్-సుజీత్ కాంబో మళ్లీ తెరకెక్కుతుందనే వార్త ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

