
📌 Key Points
- ప్రకాష్ రాజ్ వారణాసిలో శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నారు.
- మహేష్ బాబు రుద్ర పాత్రకు ప్రకాష్ రాజ్ తండ్రిగా కనిపించనున్నారు.
- వారణాసి సినిమా షూటింగ్ 59 శాతం పూర్తయింది, 2026 జూన్ నాటికి విడుదల కానుంది.
- రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు తర్వాత ప్రకాష్ రాజ్ నటిస్తున్న సినిమా ఇది.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మహా శివ భక్తుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.
వారణాసిలో ప్రకాష్ రాజ్ పాత్ర
Prakash Raj: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ (Prakash Raj)కెరియర్ మొదట్లో హీరోగా నటించిన ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలలోను సపోర్టింగ్ పాత్రలు అలాగే తండ్రి పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పలు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి సినిమాలో కూడా ఈయన భాగం అయ్యారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజు నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఏ పాత్రలో నటించబోతున్నారు తన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాల గురించి స్వయంగా ప్రకాష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తాను వారణాసి సినిమాలో మహా శివ భక్తుడి పాత్రలో కనిపించబోతున్నానని, ఈ పాత్ర తన కెరియర్ లోనే ఎంతో కీలకంగా ఉండబోతుందని తెలిపారు. అదేవిధంగా మహేష్ బాబు నటిస్తున్న రుద్ర పాత్రకు కూడా ఈయన తండ్రిగా నటిస్తున్నట్లు తెలియజేశారు.
మహేష్ బాబుతో ప్రకాష్ రాజ్ కాంబినేషన్
ఇలా ప్రకాష్ రాజ్ తన పాత్ర గురించి రీవీల్ చేయడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో వెండితెరపై కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఇప్పుడు వారణాసి సినిమాలో మరోసారి రాజమౌళితో కలిసి పని చేయబోతున్నారు. ఇక వారణాసి సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 59 శాతం షూటింగ్ పూర్తి అయిందని 2026 జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాల పాటు రామాయణ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి అయిందని రాజమౌళి తెలియచేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా ప్రియాంక చోప్రా నటించబోతున్న సంగతి తెలిసిందే విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ 7వ తేదీ గ్లోబల్ స్థాయిలో విడుదల చేయబోతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.
సినిమా షూటింగ్ వివరాలు
ప్రకాష్ రాజ్ పాత్ర గురించి స్వయంగా వెల్లడించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.


