|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హనుమాన్ డైరెక్టర్ సంచలన నిర్ణయం! ఆ దర్శకుడి బాటలో ప్రశాంత్ వర్మ? కొత్త సినిమాపై ఉత్కంఠ!

Published: 05-04-2026, 1:05 AM
హనుమాన్ డైరెక్టర్ సంచలన నిర్ణయం! ఆ దర్శకుడి బాటలో ప్రశాంత్ వర్మ? కొత్త సినిమాపై ఉత్కంఠ!
  • హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మకు మంచి గుర్తింపు లభించింది.
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రారంభం.
  • కుమారస్వామి కథతో ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
  • సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారస్వామి కథతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

ప్రశాంత్ వర్మ రూటు మార్చారా?

Prashanth Varma : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఈయన ఎన్ని సినిమాలు చేసినా సరే ఆ మధ్య వచ్చిన హనుమాన్ సినిమా మాత్రమే అతనికి మంచి క్రేజ్ ని అందించింది.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలను అందుకోవడంతో స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా జై హనుమాన్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈసారి మరో కొత్త స్టోరీ తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు డైరెక్టర్.. ఇంతకీ ఈ డైరెక్టర్ ఎలాంటి స్టోరీని ఎంచుకున్నాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో సస్పెన్స్ గా మారింది. ఆ డైరెక్టర్ ఎలాంటి స్టోరీ తో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవుడు స్టోరీలతో సినిమాలు రావడం కామన్ అయిపోయింది.. మొన్నటి వరకు శ్రీరాముడు లేదా హనుమంతుడు స్టోరీలతో సినిమాలు వచ్చేవి.. కానీ ఈ మధ్య మాత్రం దేవుళ్ళ పైనే సినిమాలను తీసేందుకు డైరెక్టర్లు కొత్త స్టోరీలను క్రియేట్ చేస్తున్నారు. ఈ కోవలోకి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయాడు. మొన్నటి వరకు హనుమంతుడి పైన సినిమాని తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా కుమారస్వామి పై కొత్త స్టోరీని క్రియేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ వర్మ కథను అందించి, నిర్మాణ పర్యవేక్షణ చేయనుండగా.. విలక్షణ నటుడు, డైరెక్టర్ సముద్రఖని మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడని టాక్.. దీని గురించి అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..

కుమారస్వామి కథతో సినిమా?

సముద్రఖని దర్శకత్వం వహిస్తారా?

ప్రశాంత్ వర్మ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఇలాంటి వైవిధ్యమైన పౌరాణిక గాథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన జై హనుమాన్ మూవీ చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వీలైనంత త్వరగా పూర్తిచేసుకుని ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన కుమారస్వామి నేపథ్యంలో సినిమా స్టోరీని రాస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డైరెక్టర్లలో కన్నడ డైరెక్టర్హీ, రో రిషబ్ శెట్టి మాత్రమే దేవుడిపై సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఆయనను ఫాలో అవుతున్నాడా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

ప్రశాంత్ వర్మ కొత్త సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఆయన పౌరాణిక గాథలను వెండితెరకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.