|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్లోబల్ స్టార్ వెనుక కన్నీటి గాథ! భారతీయులకు హాలీవుడ్ లో అవమానమా?

Published: 12-02-2026, 6:35 AM
గ్లోబల్ స్టార్ వెనుక కన్నీటి గాథ! భారతీయులకు హాలీవుడ్ లో అవమానమా?
  • ప్రియాంక చోప్రా తన 30 ఏళ్లకే భారతదేశంలో మంచి గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం పొందింది.
  • హాలీవుడ్ లో భారతీయులకు కేవలం స్టీరియోటైప్ పాత్రలే ఇస్తారని ప్రియాంక తెలిపింది.
  • అమెరికన్ పాత్ర కోసం సంవత్సరాల తరబడి పోరాడాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
  • భర్తతో విడాకుల వార్తలపై కూడా ప్రియాంక స్పష్టత ఇచ్చింది.

ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్‌గా ఎదిగినప్పటికీ, హాలీవుడ్‌లో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. భారతీయులకు స్టీరియోటైప్ పాత్రలే ఇస్తారని, అమెరికన్ పాత్రల కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా విడాకులపై వస్తున్న పుకార్లను ఖండించింది.

భారతదేశంలో ప్రియాంక చోప్రా కెరీర్

Priyanka Chopra: ఎవరైనా సక్సెస్ సాధించి ఒక హోదాలో ఉన్నారు అంటే.. ఆ హోదా వెనుక కష్టం ఎలా ఉంటుందో.. ఆ సక్సెస్ సాధించిన వారికే తెలుస్తుంది. ముఖ్యంగా నేడు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఉండొచ్చు. కానీ ఆ కష్టం వెనుక ఆమె పడ్డ కష్టం మాత్రం వర్ణనాతీతం. తాజాగా ఆ విషయాలు అన్నింటిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. కోలీవుడ్ లో విజయ్ దళపతి హీరోగా వచ్చిన ‘తమిళన్’ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది ప్రియాంక చోప్రా . ఇక 2013లో తన 30 ఏళ్ల వయసులోనే భారత్ లో మంచి ఫేమ్ తో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా పొందింది.

బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఇండియాను వదిలి, ఆమె హాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అయితే అక్కడ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడం వెనుక కష్టం గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..”నేను నా 30 ఏళ్ల వయసులోనే ఇండియాలో మంచి ఫేమ్ దక్కించుకున్నాను. ఆర్థికంగా కూడా స్థిరత్వం పొందాను. అయితే అప్పట్లో అన్నింటిని వదులుకొని లాస్ ఏంజిల్స్ వెళ్లడం చాలా భయానకంగా అనిపించింది.

హాలీవుడ్ లో ప్రియాంక ఎదుర్కొన్న సవాళ్లు

నాడు హాలీవుడ్లో అడుగు పెట్టేందుకు స్పష్టమైన మార్గం లేదు. ముఖ్యంగా భారతీయులకు కేవలం స్టీరియోటైప్ పాత్రలు మాత్రమే ఇచ్చేవారు. ఆ సమయంలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఒక అమెరికన్ క్యారెక్టర్ ను దక్కించుకోవడానికి నేను ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది” అంటూ ఆ ఇంటర్వ్యూలో వివరించింది ప్రియాంక చోప్రా. మొత్తానికైతే భారతీయులను కేవలం స్టీరియో టైప్ పాత్రలకే పరిమితం చేస్తారని , అమెరికన్ పాత్ర పొందాలి అంటే సంవత్సరాల తరబడి టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

విడాకుల వార్తలపై ప్రియాంక స్పందన

మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది ప్రియాంక చోప్రా.. వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు రాగా, దీనిపై మాట్లాడింది.” మా బంధం ఎప్పుడు కూలిపోతుందో అని చూసేవారికి ఇదే నా సమాధానం. మాకు పెళ్లయి ఎనిమిదేళ్లు దాటింది. మా పెళ్లి ఎప్పుడు పెటాకులవుతుందని ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే అది వారి ఇష్టం.. దాని గురించి ఆలోచించడం నేనెప్పుడో మానేశాను. మొదట్లో ఇలాంటి మాటలు బాధ కలిగించినా ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు” అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇకపోతే ఒకవైపు రూమర్స్ కి చెక్ పెడుతూనే మరొకవైపు కెరియర్ సక్సెస్ కు గల కారణాలను చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మొత్తానికి ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ అనుభవాలను, వ్యక్తిగత జీవితంలోని విడాకుల వార్తలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.