
📌 Key Points
- రాజమౌళి ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో ప్రియాంక చోప్రా నిద్రలేని రాత్రులు గడిపారు.
- ఆఫ్రికా అడవుల్లో జంతువుల మధ్య షూటింగ్ చేయడం సాహసోపేతంగా సాగింది.
- మహేష్ బాబు శివుడి అనుగ్రహం ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
- రాజమౌళి వీఎఫ్ఎక్స్ కంటే సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆఫ్రికా అడవుల్లో జరిగిన షూటింగ్ సమయంలో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపారు.
వారణాసి సినిమా గురించి ప్రియాంక చోప్రా
Varanasi Movie: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వారణాసి సినిమాను ప్రపంచ స్థాయిలో తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా గ్లోబల్ మీడియాతో జరిగిన జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందన్నారు. ఆ సినిమా వెనక ఉన్న కష్టాన్ని చెప్పుకొచ్చారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. టెక్నికల్ పరంగా ఎంతో ఉన్నతంగా ఉండాలనుకునే రాజమౌళి ప్రతి ప్రేమ్ లోనూ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “వారణాసి” చిత్రానికి సంబంధించి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళిని స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులతో పోల్చిన ప్రియాంక, ‘వారణాసి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా గర్వించదగ్గ ఒక గొప్ప అనుభూతి అని నొక్కి చెప్పారు. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని రీతిలో, శివుడి అనుగ్రహం ఉన్న పాత్రలో చూడబోతున్నామని ఆమె హింట్ ఇచ్చారు.
Read also- Varanasi: రాజమౌళిని ఆ ఒక్క కోరిక కోరిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబును బుక్ చేసేసిందిగా!
ఆఫ్రికా అడవుల్లో సాహసోపేతమైన షూటింగ్
ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న మాసాయి మారా అడవుల్లో జరిగిన చిత్రీకరణ గురించి ప్రియాంక మాట్లాడుతూ.. “వారణాసి సినిమా షూటింగ్ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ముఖ్యంగా ఆఫ్రికా షెడ్యూల్ చాలా సాహసోపేతంగా సాగింది. అక్కడ మేము జంతువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి షూటింగ్ చేసేవాళ్లం. వన్యప్రాణుల వలస (Migration) సమయంలో చిత్రీకరణ జరగడం వల్ల, ఏనుగుల మందలు లేదా వైల్డ్ బీస్ట్‌లు కదిలినప్పుడు మాత్రమే మేము మా డైలాగులు చెప్పాల్సి వచ్చేది. అవి ఎప్పుడు కదులుతాయో తెలియదు కాబట్టి క్రూ మొత్తం నిద్రలేని రాత్రులు గడిపారు,” అని పేర్కొన్నారు.
Read also- Varanasi Update: రాజమౌళి ప్రియాంకకు ఇచ్చిన మాట ఇదే.. అలా కాకపోతే సినిమా రిలీజ్ కాదు..
మహేష్ బాబు పాత్రపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో జంతువుల సన్నివేశాలను సీజీఐ (CGI) లేదా వీఎఫ్ఎక్స్ (VFX) ద్వారా సృష్టిస్తారు. కానీ రాజమౌళి మాత్రం సాధ్యమైనంత వరకు సహజత్వాన్ని కోరుకున్నారు. “ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పరంగా చాలా రిచ్‌గా ఉంటుంది. కానీ, నిజమైన జంతువుల మధ్య, నిజమైన లొకేషన్లలో షూటింగ్ చేయాలని రాజమౌళి సార్ పట్టుబట్టారు. అడవిలో క్రూర మృగాల మధ్య నిలబడి నటించడం ఒకింత భయం వేసినా, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది” అని ప్రియాంక వెల్లడించారు. చాలా కాలం తర్వాత ఇండియన్ స్క్రీన్ పైకి వస్తున్న ప్రియాంక, మొదట భాషా పరంగా కొంత ఆందోళన చెందారట. అయితే రాజమౌళి ఇచ్చిన హామీ తనను ఈ ప్రాజెక్ట్ వైపు నడిపించిందని ఆమె చెప్పారు. “ప్రియాంక.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో నిన్ను అత్యుత్తమంగా చూపించే బాధ్యత నాది” అని ఆయన చెప్పిన మాటలు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె గుర్తు చేసుకున్నారు.
మొత్తానికి ప్రియాంక చోప్రా వారణాసి సినిమా గురించి పంచుకున్న విషయాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.


