
📌 Key Points
- విజయ్ దళపతి కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగిన నటుడు.
- ప్రస్తుతం విజయ్ నికర ఆస్తి దాదాపు రూ. 2000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
- విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు.
- 10 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చారు, ఏడు సినిమాల్లో నటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఆస్తుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం, వ్యక్తిగత జీవితం నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు వైరల్ అవుతున్నాయి.
విజయ్ దళపతి సినీ ప్రస్థానం
Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం తన రాజకీయ అరంగేట్రం, వ్యక్తిగత జీవితంపై సాగుతున్న చర్చల నడుమ, విజయ్ ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ కేవలం నటుడిగానే కాకుండా అత్యంత రిచ్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటించిన విజయ్ ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆయన ఆస్తులు విలువ ఎన్ని కోట్లు అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
విజయ్ దళపతి సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.. జనాలని తన స్టోరీ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.. ఒక్కో సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అతి కొన్ని సినిమాలతోనే ఆయన స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఆయన ఆస్తులు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి దాదాపు రూ. 2000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.. చెన్నైలోని నీలంకరై సముద్రతీరంలో ఉన్న ఆయన బంగ్లా ఉంది. అంతేకాదు విజయ్‌కి కార్లంటే అమితమైన ఇష్టం. ఆయన గ్యారేజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్లు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ కూడా పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు విజయ్ దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించడంతో అతని ఆస్తులు కూడా వేలకోట్లలో ఉంటుందని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు..
విజయ్ ఆస్తుల విలువ ఎంత?
రెమ్యూనరేషన్ మరియు ఇతర వివరాలు
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి 1984లో తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వెట్రీ చిత్రంలో నటించాడు.. 10 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. అలా బాలనటుడిగా ఏడు సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాడు. 18 ఏళ్ల వయసులో `నాలయ్య తీర్పు` సినిమాతో హీరోగా మారారు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కాస్త అటు ఇటు సినిమాల రిజల్ట్ ఉన్నా సరే ఆ తర్వాత కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.. తర్వాత ఆయన నటించిన సినిమాలు కాస్త మంచి టాక్ ని అందుకోవడంతో అతని క్రేజ్ కూడా పెరిగింది. తమిళంలో మాత్రమే కాదు కేరళలో, అలాగే తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్రిలీజ్ కి సిద్ధంగా ఉంది… ఆ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న విషయం తెలిసిందే…
విజయ్ దళపతి సినీ జీవితం, ఆస్తుల గురించి ఈ కథనంలో తెలుసుకున్నాం. ఆయన రాజకీయ భవిష్యత్తు, వ్యక్తిగత జీవితంపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


