
📌 Key Points
- Psych Siddhartha జనవరి 1న విడుదల కానుంది.
- సురేష్ ప్రొడక్షన్స్ ₹105కే టికెట్ ఆఫర్‌ను ప్రకటించింది.
- ఈ ఆఫర్ హైదరాబాద్‌లోని PVR Inox థియేటర్లలో వర్తిస్తుంది.
- గతంలో డిసెంబర్ 12న విడుదల కావాల్సిన సినిమా బాలకృష్ణ అఖండ 2 కారణంగా వాయిదా పడింది.
న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రియులకు ఓ అదిరిపోయే శుభవార్త! వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైక్ సిద్ధార్థ్’ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ హైదరాబాద్‌లోని PVR Inoxలో కేవలం ₹105లకే టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బంపర్ ఆఫర్‌తో నూతన సంవత్సరాన్ని సరైన సినిమాతో ప్రారంభించండి.
న్యూ ఇయర్ బంపర్ ఆఫర్: సైక్ సిద్ధార్థ టికెట్ ధరలు
Psych Siddhartha: ఇటీవల కాలంలో ఏదైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు కాస్త పెంచుతున్నారు కానీ చిన్న సినిమాలకు అత్యంత తక్కువ ధరకే టికెట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 99 రూపాయలకే టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చి చిన్న సినిమాల నిర్మాతలు మంచి లాభాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్స్ సందర్భంగా రాబోయే సినిమాల విషయంలో కూడా టికెట్ల రేట్ల విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు (Sree Nandu), యామిని భాస్కర్(Yamini Bhaskar) ప్రధాన పాత్రులలో నటించిన సైక్ సిద్ధార్థ్ (Psych Siddhartha) ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ విడుదల కానుంది.
నిజానికి ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు బాలకృష్ణ అఖండ 2 సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతూ జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదలకు మరొక రోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టికెట్ ధర గురించి సురేష్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా జనవరి ఒకటో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాదులోని పివిఆర్ ఐనాక్స్(PVR Inox) ధరలను తగ్గిస్తూ అధికారకంగా తెలియచేశారు.
ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని తన అధికారక ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. అత్యంత తక్కువ ధరికే బిగ్ స్క్రీన్ పై సరికొత్త సినిమాని ఎంజాయ్ చేయండి అంటూ చిత్ర బృందం హైదరాబాద్లోని పివిఆర్ ఐనాక్స్ లో సైక్ సిద్ధార్థ సినిమా టికెట్ ధరలను కేవలం రూ. 105 లకే అందుబాటులోకి తీసుకువచ్చారు. జనవరి ఒకటవ తేదీ సైక్ సిద్ధార్థ సినిమాని అసలు మిస్ అవ్వదు, ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Big screen entertainment, budget-friendly vibes 🔥
వాయిదా పడిన విడుదల, కొత్త డేట్
Watch #PsychSiddhartha at PVR INOX for just ₹105/- 🎟️ in Telangana
A fresh, entertaining youthful breakup story to start your New Year right ✨ 🔥
Don’t miss the vibe #PsychSiddhartha Relasing on Jan1st 2026 🔥
Book your… pic.twitter.com/efooimybIp
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్
— Suresh Productions (@SureshProdns) December 30, 2025
సాధారణంగా పివిఆర్ లో సినిమా చూడాలంటే టికెట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాంటిది కేవలం 105 రూపాయలకే ఈ సినిమా చూసే అవకాశాన్ని చిత్ర బృందం కల్పించారు. ఇక ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా కేవలం 99 రూపాయలకు మాత్రమే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. చాలా రోజుల తర్వాత శ్రీ నందు ఒక అద్భుతమైన విభిన్న కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇదివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో నందు సిద్ధార్థ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ నందు రానా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి శ్రీ నందుకి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సురేష్ ప్రొడక్షన్స్ అందిస్తున్న ఈ ఆఫర్ సినీ అభిమానులను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. నూతన సంవత్సర కానుకగా తక్కువ ధరకే ‘సైక్ సిద్ధార్థ్’ సినిమాను చూసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెంటనే మీ టికెట్లను బుక్ చేసుకోండి!


