
శ్రావణ శుక్ల పక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈరోజు మంగళగౌరీ వ్రతం, సిద్ధి, రవి యోగాలు కూడా ఉన్నాయి. మేష, మిధున, ధనస్సు, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురుచూస్తున్నాయి.
Key Points
పుత్రదా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించండి.
మేష, మిధున, ధనస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం.
కొత్త ఉద్యోగాలు, ప్రాజెక్టులు, ఆర్థిక లాభాలు.
పిల్లల ఆరోగ్యం, కుటుంబ సంతోషం పెరుగుతాయి.
పుత్రదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత
శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. పుత్రదా ఏకాదశి నాడు శుభ యోగాలు ఏర్పడతాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం ఉంటే శుభ ఫలితాలను పొందవచ్చు. సంతానం లేని వారు సంతానం కలగడానికి ఈ పుత్రద ఏకాదశి నాడు ప్రత్యేకంగా వ్రతం చేస్తారు. అదే విధంగా ఉపవాసం కూడా ఉంటారు.
పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పూజ చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు. ఈ ఏకాదశి నాడు మహా విష్ణువుని, లక్ష్మీ దేవిని ఆరాధిస్తే విష్ణువు మీ కోరికలను తీరుస్తాడు. ఈసారి పుత్రదా ఏకాదశి ఆగస్టు 5, మంగళవారం అంటే ఈరోజు వచ్చింది. పైగా ఈరోజు మంగళగౌరీ దేవి వ్రతం కూడా చేసుకుంటారు. వీటితో పాటు తర్వాత సిద్ధి యోగం, రవి యోగం కూడా ఏర్పడ్డాయి.
పుత్రదా ఏకాదశి నాడు ఈ నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది:
నాలుగు అదృష్ట రాశులు
మేష రాశి వారికి పుత్రదా ఏకాదశి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు ఏదైనా పనిని మొదలుపెడితే, కచ్చితంగా అది పూర్తయిపోతుంది. కెరియర్‌లో కూడా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండొచ్చు.
మిధున రాశి వారికి పుత్రదా ఏకాదశి నాడు కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగం రావచ్చు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులను కలుస్తారు.
ధనస్సు రాశి వారికి ఏకాదశి వేళ శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు బాధ్యతలను పూర్తిచేస్తారు. ట్రిప్పులు వేసే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా బాగా ఉంటుంది.
ఏకాదశి వ్రతం చేసే విధానం
కుంభ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఎదురవుతాయి. కెరియర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పుత్రదా ఏకాదశి వ్రతం ద్వారా భక్తి, శ్రద్ధతో పాటు, జ్యోతిష్య సూచనలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


