
టాలీవుడ్ నటి నభా నటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాధారూపంలో కనిపించే ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమె ప్రేమ జీవితం గురించి ఆసక్తిగా ఉన్నారు.
Key Points
నభా నటేష్ తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
రెడ్ బ్లౌజ్ అండ్ ఓణీ, మెరూన్ లంగాతో రాధలా కనిపించింది.
నెటిజన్లు ఆమె కృష్ణుడిని పరిచయం చేయమని కోరుతున్నారు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నభాకు మంచి గుర్తింపు వచ్చింది.
నభా నటేష్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది.
రాధా రూపంలో నభా
అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ ఓణీతో పాటు మెరూన్ కలర్ లంగా వేసుకుంది. ఇక సేమ్ టు సేమ్ రాధలా రెడీ అయింది. ఇక ఈ సూపర్ క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘కాంక్రీట్ అడవిలో ఉన్న రాధ – గందరగోళంలో దయను మరియు హడావిడిలో లయను కనుగొంటుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ కృష్ణుడ్ని ఎప్పుడు పరిచయం చేస్తావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్
A post shared by Nabha Natesh (@nabhanatesh)
నభా నటేష్ యొక్క అందమైన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


