
📌 Key Points
- అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి రాధిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
- ఆట డాన్స్ షోలో పుష్ప 2 పాటకి ప్రీతి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
- అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి తానే కారణమని రాధిక అన్నారు.
- రైల్వే ట్రాక్ మీద పరిగెడుతూ డ్యాన్స్ ఎలా చేయాలో బన్నీకి నేర్పించానని రాధిక తెలిపారు.
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ కు డ్యాన్స్ నేర్పించింది తానేనని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.
అల్లు అర్జున్ డ్యాన్స్ పై రాధిక షాకింగ్ కామెంట్స్
Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు. ఈయన నటనలోనూ డాన్స్ విషయంలో కూడా సపరేట్ స్టైల్ మెయింటెన్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి స్టెప్స్ అయినా ఎంతో అలవోకగా వేస్తూ తన డాన్స్ తో మెస్మరైస్ చేస్తుంటారు.
ఇలా డాన్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి నటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న రాధిక శరత్ కుమార్ ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ఆట డాన్స్ షో కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన ఒక ప్రోమోలో భాగంగా పుష్ప 2 సినిమాలోని అమ్మోరు జాతర పాటుకు సంబంధించి కంటెస్టెంట్ ప్రీతి పర్ఫామెన్స్ చేశారు. అల్లు అర్జున్ కు ఏ మాత్రం తీసి పోకుండా ప్రీతి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఈ పెర్ఫార్మెన్స్ పట్ల జడ్జెస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఆట డాన్స్ షోలో పుష్ప 2 పాటకి ప్రీతి పెర్ఫార్మెన్స్
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బన్నీ గురించి కూడా ప్రస్తావనకు రావడంతో రాధిక మాట్లాడుతూ అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి నేనే కారణం అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. రాధిక ఇలా చెప్పడంతో వెంటనే నిహారిక ఎందుకు రాధిక గారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాధిక సమాధానం చెబుతూ.. తాను అల్లు అరవింద్ గారి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేశానని అందులో ఒక అబ్బాయిని ఎత్తుకొని రైల్వే ట్రాక్ మీద పరిగెత్తే సీన్ ఉందని ఈమె తెలియజేశారు.
అల్లు అర్జున్ ఎత్తుకొని పరిగెత్తాను..
బన్నీకి డ్యాన్స్ నేర్పించింది నేనేనన్న రాధిక
ఇలా రైల్వే ట్రాక్ సీన్ చేసే సమయంలో చిన్న పిల్లాడు ఎవరు కనిపించలేదు ఆ టైంలో బిన్నీ మాత్రమే షూటింగ్ లొకేషన్లో ఉన్నారని రాధిక చెప్పారు. వెంటనే సుధీర్ అంటే మా బన్నీ గారిని ఎత్తుకొని మీరు రైల్వే ట్రాక్ మీద పరిగెత్తారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మాటలకు రాధిక సమాధానం చెబుతూ అవును అప్పుడే నేను బన్నీను ఎత్తుకొని రైల్వే ట్రాక్ మీద పరిగెడుతూ డాన్స్ ఎలా చేయాలో నేర్పించాను అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాధిక ఈ విషయాన్ని ఫన్నీ గానే చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అమ్మా రాధిక గారు మా హీరో డాన్స్ క్రెడిట్ మొత్తం మీరు కొట్టేసారా? అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు మా హీరోని ఇంత మంచి డాన్సర్ గా చేసినందుకు థాంక్యూ మేడం అంటూ ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు.
రాధిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

