|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంగ్రెస్‌లో కుమ్ములాట: రాహుల్‌కు సీనియర్ల షాక్! ఏం జరుగుతోంది?

Published: 04-04-2026, 4:05 AM
కాంగ్రెస్‌లో కుమ్ములాట: రాహుల్‌కు సీనియర్ల షాక్! ఏం జరుగుతోంది?
  • కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతున్నాయా?
  • యుద్ధ పరిస్థితులపై మోడీ సర్కార్ పనితీరును కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రశంసించడం చర్చనీయాంశం.
  • దేశంలో గ్యాస్ కొరత లేదని కమల్ నాథ్ వ్యాఖ్యానించడం రాహుల్ ఆరోపణలకు విరుద్ధంగా ఉంది.
  • సిలిండర్ల కోసం ప్రజలు క్యూ కడుతుంటే కొందరు రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తున్నారని కమల్ నాథ్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇది కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

రాహుల్ ప్రయత్నాలకు సీనియర్ల అడ్డుకట్ట?

బీజేపీ వ్యూహాలతో గడిచిన 12 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ (Congress) పార్టీలో సొంత నేతల తీరు మరోసారి హాట్ టాపిక్‍గా మారాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో సమిష్టిగా ప్రత్యర్థిపై గురి పెట్టాల్సిన సీనియర్లు తమ అధినేత వైఖరితో విభేధించడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. ఓ వైపు ఇరాన్ యుద్ధం, మరోవైపు ఎన్నికల ప్రచారం కలగలిపి కేంద్రంలోని మోడీ సర్కార్‍ను ఇరకాటంలో పెట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సొంత పార్టీ నేతలే రాహుల్ గాంధీ (Rahul Gandhi) వైఖరిని తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేస్తుండటం ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి పార్టీ ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలుపుకోవాలని చూస్తున్న రాహుల్ గాంధీకి తాజా పరిణామాలు కొత్త తలనొప్పిగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది.

మోడీ సర్కార్‌ను ప్రశంసించిన కాంగ్రెస్ నేత

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వేళ పరిస్థితులను అంచనా వేసి వ్యవహరించడంలో ప్రధాని మోడీ విఫలం అయ్యారని అందువల్లే దేశంలోచమురు, గ్యాస్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని రాహుల్ గాంధీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన స్టేట్ క్రాఫ్ట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కొనియడగా కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ మాత్రం భిన్నంగా స్పందించారు. యుద్ధ సంక్షోభ సంబంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆనంద్ శర్మ ప్రశంసించారు. ప్రభుత్వం చాలా పరిణతితో, నైపుణ్యంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రశంసించారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ స్పందిస్తూ దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని కేవలం రాజకీయ లబ్ధికోసమే కొందరు లేనిపోని వాతవరణాన్ని సృస్తు్న్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న ఆరోపణలకు కమల్ నాథ్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

గ్యాస్ కొరతపై భిన్న వాదనలు

ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క సిలిండర్ కోసం ప్రజలు భారీ క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పిరస్థితుల్లో తమ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు పార్టీ నాయకత్వం విమర్శలు గుప్పిస్తుంటే సీనియర్ నేతలనుకున్న వారే అందుకు రివర్స్ గా మాట్లాడటం బీజేపీకి చేజేతులా ఆయుధాలు ఇచ్చినట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సొంత నేతల వ్యాఖ్యలను తమ ఆయుధాలుగా మలుచుకుని కాంగ్రెస్ పై ఇప్పుడు బీజేపీ ఎదురు దాడికి దిగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. కమల్ నాథ్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని, కాంగ్రెస్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ఆపాలని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు భవిష్యత్ లో ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ స్థానాన్ని నిర్దేశించబోతుందనే చర్చ జరుగుతున్న వేళ హస్తం నేతల్లో ఈ తరహా చీలిక మాటలు ఏ తీరం చేరుతుందో చూడాలి మరి.

మొత్తానికి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల భిన్న స్వరాలు రాహుల్ గాంధీకి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.